హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ సన్నిహితులతోనే జగన్‌పై ఎదురుదాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి పకడ్బందీ వ్యూహం రచించారు. గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులైన మంత్రులతోనే ఎదురు దాడి చేయిస్తున్నారు. జగన్‌పై మంగళవారం సీనియర్‌ మంత్రులు ఎదురుదాడికి దిగిన మంత్రులను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. మంత్రి వట్టి వసంతకుమార్ మంగళవారంనాటి మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎక్కువగా మాట్లాడారు. ఆయన వైయస్సార్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు.

మీడియా సమావేశంలో పాల్గొన్న సీనియర్‌ మంత్రులు రఘువీరారెడ్డి, కాసు కృష్ణారెడ్డి, మోపిదేవి వెంకటరమణ వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులే. జగన్ వర్గంపై ఎలాంటి విమర్శలు ఎక్కుపెట్టాలన్న దానిపై ఈ మంత్రులు ముఖ్యమంత్రితో మీడియా సమావేశానికి ముందు సుదీర్ఘంగా భేటీ అయి చర్చించారు. ఎమ్మెల్యేల కదలికల గురించి మాట్లాడుకున్నారు. ఇప్పటికే రాజీనామాలు చేసిన వారిలో కొందరినైనా వెనక్కి తీసుకురావటానికి ప్రయత్నించాలని నిర్ణయించారు. వైఎస్‌ ఇప్పుడు ఉండి ఉంటే జగన్‌పై ఆయనే సీబీఐ విచారణకు ఆదేశించి ఉండేవారని మంత్రులు అన్నారు. వైయస్ జగన్ వాదనలను వట్టి వసంతకుమార్ సుదీర్ఘంగా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎండగట్టే ప్రయత్నం చేశారు.

English summary
CM Kiran Kumar Reddy has selected close associates YS Rajasekhar Reddy to counter YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X