హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గానికి ముఖం చాటేస్తున్న ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మరింత మంది శాసనసభ్యులు తమ వైపు వస్తారని, మరో 13 మంది తమ వెంట నడుస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన నేతలు చెబుతున్నవి ఉత్త కబుర్లేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వైఎస్‌ సెంటిమెంట్‌ను గుర్తుచేస్తూ, ప్రలోభాల వల విసురుతున్నా శాసనసభ్యులు వినిపించుకోవడం లేదని అంటున్నారు. గతంలో జగన్‌ వర్గానికి సన్నిహితంగా మెలిగిన పలువురు ప్రస్తుత పరిణామాలతో ముఖం చాటేస్తున్నారు. ఆయనతో కలిసి ఓదార్పు యాత్రలో పాల్గొన్న వారు, సన్నిహితంగా మెలిగిన వారు కూడా ఏదో ఒక కారణం చెబుతూ పక్కకు తప్పుకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి కొందరు ఫోన్లు కూడా ఎత్తడం లేదని తెలిసింది.

గత మూడు రోజులుగా పలువురు ఎమ్మెల్యేలకు యువనేత వర్గానికి చెందిన ముఖ్యులు ఫోన్లు చేసి తమతో పాటు రావలసిందిగా కోరుతున్నారు. కొందరికి భారీ ప్యాకేజీల ఆశ చూపినా ఫలితం ఉండడం లేదని అంటున్నారు. కొంత మంది ఫోన్లు కూడా ఎత్తడం లేదు. ఇటీవలే కాంగ్రెస్‌తో విలీనమైన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలపైనా జగన్ వర్గం నాయకులు వల విసురుతున్నట్లు చెబుతున్నారు.

రెండో దశలో కనీసం మరో ఆరేడుగురితోనైనా రాజీనామాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్న జగన్‌ వర్గం తాజా పరిస్థితితో డీలా పడుతోంది. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా కొందరు తమ రాజీనామాలు ఆమోదించరు కదా అంటూ ఆరా తీస్తోన్నట్లు తెలిసింది. రాజీనామాలు ఆమోదించే సమయంలో ఒక్కొక్కరినే పిలిచి మాట్లాడితే కొందరు వెనక్కు తగ్గవచ్చని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

English summary
According to report most of the MLAs are not ready take YSR Congress party president YS Jagan side.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X