వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీనామాలకు యశ్వంత్ సిన్హా, శతృఘ్న సిన్హా రెడీ

లోక్‌పాల్ అంశంపై బిజెపి బలమైన వైఖరిని తీసుకోవడం లేదని, అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్లకపోవడాన్ని యశ్వంత్ సిన్హా తప్పు పట్టారు. ఎల్‌కె అద్వానీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్నా హజారే ఆరోగ్యంపై యశ్వంత్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. హజారే వ్యవహారంపై బిజెపి మాట వరుసకే మద్దతు ప్రకటిస్తోందని, స్పష్టమైన వైఖరి తీసుకోవడం లేదని యశ్వంత్ సిన్హా విమర్సించారు. వారిద్దరి మాటలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇటువంటి సమావేశాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయని బిజెపి సీనియర్ నాయకుడు ఆహ్లూవాలియా అన్నారు.