• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అన్నా దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం, డిమాండ్లకు ఓకే

By Pratap
|

Anna Hazare
న్యూ ఢిల్లీ: అన్నా హజారే దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. అన్నా హజారే మూడు డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. దీక్ష విరమించవలసిందిగా న్యూయార్క్‌నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి కోరినా, ప్రభుత్వం తమ కోరికలను ఆమోదించేవరకూ దీక్ష విరమించేది లేదని అన్నా గురువారంనాడు స్పష్టం చేశారు. అన్నా కోరిక ప్రకారం మూడు ముఖ్యమైన డిమాండ్లపై శుక్రవారంనాడు పార్లమెంటులో చర్చకు కేంద్రం అంగీకరించింది. ఆ చర్చ ప్రారంభం కావడంతోనే అన్నా దీక్ష విరమిస్తారని తెలుస్తోంది. ప్రతి రాష్ట్రంలోనూ లోకాయుక్తను ఏర్పాటు చేయాలని, క్రింది స్థాయి అధికారులను లోక్ పాల్ పరిధిలోకి తీసుకురావాలని, సిటిజన్ చార్టర్‌పై పార్లమెంటు చర్చించాలని అన్నా చేసిన డిమాండ్లను ప్రధాని నాయకత్వాన జరిగిన మంత్రివర్గ స్థాయి సమావేశంలో క్షుణ్ణంగా చర్చించినట్టు తెలుస్తున్నది. ఈ సమావేశంలో వెల్లడైన అభిప్రాయాల ప్రకారం రేపే పార్లమెంటులో చర్చించే అవకాశం ఉంది.

అన్నా హజారే దేశంలో అవినీతిపై ప్రజలలో గతంలో ఎన్నడూ లేనంతటి స్పృహ కలిగించారని ప్రధాని గురువారంనాడు పార్లమెంటులో ప్రశంసించారు. శుక్రవారంనాడు పార్లమెంటులో ఏయే అంశాలను చర్చించేదీ గురువారం సాయంత్రం ఏ క్షణాన్నయినా కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని వైఖరితో ఇంతకుముందు అన్నా హజారేను విమర్శించినవారు చెంపలు వేసుకున్నారు. అన్నా హజారే దీక్ష గురువారానికి పదవ రోజుకు చేరుకున్నది. అన్నా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ప్రజా ఉద్యమం రోజురోజుకీ బలపడుతున్నది. అన్నా మద్దతుదారులు అన్ని ప్రధాన నగరాలలోనూ రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అన్నా స్వగ్రామంలో అయితే గ్రామస్థులు గుండు కొట్టించుకుని అన్నాకు సంఘీభావం ప్రకటించారు.

English summary
The government has agreed to begin a discussion on all Lokpal Bills in Parliament on Friday, TV channels reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X