వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎంపిల్లో చీలిక, లోకసభకు హాజరైన ముగ్గురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
న్యూఢిల్లీ: తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పార్లమెంటు సమావేశాలకు హాజరుకామని చెప్పిన తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు మాట తప్పారు. అధిష్టానం నుండి ఎలాంటి హామీ రాకుండానే లోకసభకు హాజరయ్యారు. గురువారం లోకసభ సమావేశాలకు ముగ్గురు పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మరో ఎంపీ సురేష్ షేట్కార్ లోకసభ సమావేశాలకు గురువారం హాజరయ్యారు.

అయితే మిగిలిన ఎంపీలు మాత్రం హాజరు కాలేదు. లోకసభ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, రాజయ్య, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావులు హాజరు కాలేదు. అయితే 14 ఎఫ్‌పై కేంద్రం వెనక్కి తగ్గి రద్దు చేసినందు వల్లే హాజరయ్యారనేది పలువురి భావన. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు మంత్రులు తమ విధులకు హాజరవుతున్నారు. కాగా తెలంగాణ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌కు టి-ఎంపీలు లేఖ రాశారు.

English summary
Telangana MPs Madhu Yashki, Balaram Naik and Suresh Shetkar attended to Lok Sabha today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X