• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైయస్ జగన్ వైపు?

By Srinivas
|

Jeevan Reddy-Komitireddy Venkat Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి చాలా కాలం తర్వాత బయటకు వచ్చి వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడటం కాంగ్రెసు పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో జగన్‌కు లోపయకారిగా మద్దతు పలికారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తెలంగాణ అంశంపై అధిష్టానాన్ని మిగిలిన నాయకుల కంటే లక్ష్యంగా చేసుకోవడమూ చర్చానీయాంశమయినట్టుగా తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని పవిత్రుడుగా చెబుతూనే జగన్‌ను తప్పు చేసిన వ్యక్తిగా కాంగ్రెసు నేతలు ఎదురుదాడికి సిద్ధమైన సమయంలో జీవన్ రెడ్డి జగన్ దోషి అని తేలితే ఆ బురద కాంగ్రెసు పైనే పడుతుందని, అందుకు అందరూ బాధ్యత వహించాలని బుధవారం అన్నారు.

సొంత పార్టీ నేతలనే జీవన్ రెడ్డి లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఆయనకు వ్యూహాలు ఉండి ఉండవచ్చునని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జీవన్ వైయస్సార్‌కు చాలా సన్నిహితుడు. ఆ కారణంగా వైయస్ సూచనలతో పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై రెండుసార్లు జీవన్ రెడ్డి పోటీ చేశారు. వైయస్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన కాంగ్రెసు కంటే జగన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఉండుంటే జీవన్ రెడ్డి ఆయన వైపు మొగ్గు చూపే వారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యమం ఉధృతంగా నేపథ్యంలో జగన్ ఏ నిర్ణయం తీసుకోనుందనే జీవన్ వైయస్సార్సీ పార్టీలో చేరే అంశంపై ఆలోచించడం లేదని, భవిష్యత్తులో జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా లేక సమస్య పరిష్కారమైనా జీవన్ జగన్ వెంట వెళ్లే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరుల పైనా ఇలాంటి అనుమానాలే ఉన్నట్లుగా కనిపిస్తోంది. గతంలో జగన్ సమావేశాలకు వారు లోపాయికారిగా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన నేతలకు భిన్నాంగా కోమటిరెడ్డి సోదరులు తెలంగాణ అంశంపై అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. వీరు కూడా తెలంగాణ అంశం కారణంగానే జగన్‌తో వెళ్లేందుకు వెనకాడుతున్నారని లేదంటే ఎప్పుడో ఆయన వర్గంలో చేరి పోయే వారనే ఆరోపణలు ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి సైతం గ్యారెంటీ లేదు. అంతేకాకుండా దివంగత వైయస్ అండతో ఔటర్ రింగు రోడ్డు వ్యవహారంలో కోమటిరెడ్డి సోదరులు, బంధువులు లబ్ధి పొందినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పలు కారణాల వల్ల ఎప్పటికైనా వారు జగన్‌తో వెళ్లే వారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ పార్టీలో చేరే వాదనలను మాత్రం వారు ఖండిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It seems, former minister Jeevan Reddy may join in YSRC Party after solved Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more