• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరుణానిధికి దెబ్బపై దెబ్బ, అళగిరిపై చార్జిషీట్ దాఖలు

By Pratap
|

MK Alagiri
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధిపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తాజాగా, కేంద్ర మంత్రి ఎంకె అళగిరిపై, డిఎంకె కార్యకర్తలపై చార్జిషీట్ దాఖలైంది. శాసనసభ ఎన్నికల సందర్భంగా మేలూరు తహసిల్దార్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎం. కళిముత్తుపై దాడి చేశారనే ఆరోపణపై ఈ చార్జిషీట్ దాఖలైంది. వంద పేజీల చార్జిషీట్‌ను ఈ నెల 22వ తేదీన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు దాఖలు చేశారు.

అళగిరి, ఆయన మద్దతుదారులు ఏప్రిల్ 1వ తేదీన మేలూరు సమీపంలోని వెల్లలూర్ గ్రామంలో గల శ్రీ వల్లదికరార్ స్వామి ఆలయంలో నిర్వహించిన సమయంలో వీడియో తీయడానికి ప్రయత్నించిన వీడియోగ్రాఫర్‌ను బెదిరించారు. దాంతో ఆ వీడియోను అతను కళిముత్తు చేతిలో పెట్టి అతను పారిపోయాడు. దాంతో కళిముత్తుపై వారు తిడుతూ దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆయన దానిపై ఫిర్యాదు చేశారు. అయితే, కళిముత్తు ఆ తర్వాత తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.

English summary
Charge sheet has been filed against Union Minister M.K. Alagiri and other Dravida Munnettra Kazhagam functionaries in a case of attack against Tahsildar M.Kalimuthu, who was also the Assistant Returning Officer for Melur Assembly Constituency, during the State Assembly elections. The charge sheet, running over 100 pages, was submitted to the Judicial Magistrate Court in Melur on August 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X