వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఎఫెక్ట్: కాంగ్రెసుపై ఎంపి సాయి ప్రతాప్ నిరసన

By Pratap
|
Google Oneindia TeluguNews

Sai Pratap
న్యూఢిల్లీ: మరో పార్లమెంటు సభ్యుడు తమ వెంట వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి చెప్పిన మాటలు నిజమయ్యేట్లు కనిపిస్తున్నాయి. తాజాగా, రాజంపేట పార్లమెంటు సభ్యుడు తమ కాంగ్రెసు పార్టీ తీరుపై నిరసన గళం విప్పారు. సాయి ప్రతాప్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైయస్ చలువ వల్లనే ఆయన కేంద్రంలో సహాయ మంత్రి పదవి చేపట్టారు. అయితే, ఇటీవలి పునర్వ్యస్థీకరణలో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు.

వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు నాయకులు నోరు పారేసుకోవడం మంచిది కాదని సాయి ప్రతాప్ శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పదవుల కోసం కాంగ్రెసు నాయకులు వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్సిస్తున్నారని ఆయన తప్పు పట్టారు. తప్పులు చేసినవారికి శిక్షలు పడాల్సిందేనని, అయితే మరణించిన వ్యక్తిని తక్కువ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని దొంగగా చిత్రీకరిస్తున్నారని, ఓ మిత్రుడిగా దాన్ని తాను తీవ్రంగా నిరసిస్తున్నానని ఆయన అన్నారు.

ప్రధాని ప్రశంసలు అందుకున్న ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాలను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినవేనని ఆయన అన్నారు. వైయస్సార్ చలువ వల్లనే కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్సిస్తే పార్టీకి నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. వ్యాపారం వేరు, రాజకీయం వేరని ఆయన అన్నారు.

English summary
Congress Rajampet MP Sai Pratap opposed Congress leaders for criticising YSR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X