వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానిని తీసుకు వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి: జెపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రిని, న్యాయవ్యవస్థనూ లోక్‌పాల్ పరిధిలోకి తీసుకు రావాలని చెప్పటం సముచితం కాదని లోక్‌సత్తా అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణ శుక్రవారం న్యూఢిల్లీలో అన్నారు. ఒకవేళ ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకు వచ్చినా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకు రావడంపై పలు జాగ్రత్తలతో పాటు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. అవినీతిని అంతమొందించాలంటే అధికార వికేంద్రీకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయడమే ఏకైక పరిష్కారమని జయప్రకాశ్ నారాయణ చెప్పారు.

లోక్‌పాల్ విచారణ తర్వాత శాఖాపరమైన విచారణలు అర్థరహితమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కేంద్ర ప్రభుత్వం జయప్రకాశ్ నారాయణ రూపొందించిన లోక్‌పాల్ బిల్లు ప్రతిని తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం పార్లమెంటులో లోక్‌పాల్ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెసు పార్టీకి చెందిన ముగ్గురు పార్లమెంటు సభ్యులు జన్ లోక్‌పాల్ బిల్లుపై చర్చ కోసం నోటీసులు ఇచ్చారు. ఎంపీలు జగదాంబికా పాల్, అనూటాండన్, సంజయ్ నిరుపమ్‌లు నోటీసులు ఇచ్చారు.

English summary
Loksatta president, Kukatpally mla Jayaprakash Narayana differed with Anna Hazare on Lok Pal bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X