వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాహజారేకు ధన్యవాదాలు: లోకసభలో రాహుల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: అవినీతిపై పోరాటం చేస్తున్న సంఘ సంస్కర్త అన్నాహజారేకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ శుక్రవారం లోకసభలో ధన్యవాదాలు తెలిపారు. అవినీతిపై జాతిని మేల్కొలిపారని ఆయన అభిప్రాయపడ్డారు. అవినీతిపై ప్రజల మనోభావాలను అన్నాహజారే ప్రతిబింబించారన్నారు. అవినీతిని రూపుమాపేందుకు రాజకీయశక్తులు ఐక్యంగా ప్రయత్నించాలన్నారు. అవినీతిని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమర్థవంత లోక్‌పాల్ బిల్లు మాత్రమే అవినీతిని అంతమొందిస్తుందన్నారు. అయితే లోక్‌పాల్ ఒక్కటే అవినీతిని అంతమొందించలేదన్నారు.

అవినీతి నిర్మూలనకు బలమైన రాజకీయ సంకల్పం, చట్టాలు రావాలన్నారు. అవినీతి నిర్మూలనతోనే పేదరికం పోతుందన్నారు. సులభమైన పరిష్కారాల ద్వారా దేశంలో అవినీతిని అంతమొందించలేమన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు దగ్గరి దారి కానీ, మంత్రదండం కానీ లేదన్నారు. ఎన్నికల సంఘం తరహాలో లోక్‌పాల్ కమిటీ ఉండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చాలని భావించడం లేదన్నారు. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయరాదన్నారు. వ్యవస్థలు స్వతంత్ర్యంగా ఉంటే దేశం ముందుకు వెళుతుందన్నారు. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా దానిని అంతమొందించేందుకు చిత్తశుద్ధి కావాలన్నారు.

English summary
All India Congress Committee (AICC) general secretary Rahul Gandhi, Friday, addressed the Parliament on Lokpal logjam during Zero Hour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X