వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్సార్ వర్ధంతి రోజు మరిన్ని రాజీనామాలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకులు పరస్పరం మైండ్ గేమ్ ఆడుతున్నారు. మరింత మంది రాజీనామాలు చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు నమ్మబలికే ప్రయత్నం చేస్తుంటే రాజీనామాలు చేసినవాళ్లలో చాలా మంది తిరిగి వస్తారని కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనే వాదనను వైయస్సార్ కాంగ్రెసు నాయకులు గట్టిగా చెబుతున్నారు. మరో 25 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు శుక్రవారం తిరుపతిలో చెప్పారు. వచ్చేవి ఉప ఎన్నికలు కావని, మధ్యంతర ఎన్నికలని ఆయన అన్నారు.

కాగా, మరో 15 మంది శాసనసభ్యులు వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సెప్టెంబర్ 2వ తేదీన రాజీనామాలు చేయడానికి రంగం సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 26 మంది జగన్ వర్గం శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. మరో 15 మంది కాంగ్రెసు శానససభ్యులు రాజీనామాలు చేస్తే ప్రభుత్వం చిక్కుల్లో పడడం ఖాయం. కానీ అది సాధ్యమవుతుందా, జగన్ వర్గం నాయకులు చెప్పేదాంట్లో నిజం ఉందా అనేది అనుమానంగానే ఉంది. ప్రస్తుతానికైతే 29 మంది శాసనసభ్యులు జగన్ వైపు ఉన్నారు. కాగా, శుక్రవారం శాసనసభ్యుడు మల్లాది విష్ణు తమ కాంగ్రెసు పార్టీపై నిరసన గళం వినిపించారు. వైయస్సార్‌ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై మైండ్ గేమ్ ఆడుతున్నారు. తాను సర్వేలు చేయించానని, రాజీనామాలు చేసిన 26 మంది శాసనసభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో తిరిగి గెలవడం కష్టమని ఆయన చెబుతున్నారని అంటున్నారు. రాజీనామాలు చేసిన శాసనసభ్యులకు వారి మిత్రులతో ఫోనులు చేయించి వెనక్కి రావాలని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న వైయస్ జగన్‌ను శుక్రవారం పలువురు శాసనసభ్యులు కలిశారు. రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, కుంజా సత్యవతి, ప్రసాదరాజు, ఎమ్మెల్సీ శేషుబాబు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లడానికి జగన్ వర్గం నిర్ణయించుకుంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై విరుచుకుపడుతోంది.

English summary
YSR Congress party leaders are playing mind game putting compaign about MLAs resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X