హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై కెసిఆర్ మెతక వైఖరి వెనక బిజెపి వ్యూహం

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: బిజెపి అగ్ర నాయకత్వం వ్యూహంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల వరకు తెలంగాణ అంశం తేలే అవకాశం లేదని గ్రహించిన కెసిఆర్ ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను మట్టి కరిపించి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడేలా చేయాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమవుతుందని ఆయన భావిస్తున్నారు.

కర్ణాటకలో కాంగ్రెసును దెబ్బ తీసిన బిజెపి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను దెబ్బ తీయడానికి ఓ వైపు వైయస్ జగన్‌ను, మరో వైపు కెసిఆర్‌ను చేరదీయడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు ఘన విజయం సాధిస్తుందనే అంచనాలో బిజెపితో పాటు తెరాస కూడా ఉంది. సిబిఐ దర్యాప్తు, వైయస్ జగన్ అరెస్టు ఎలా ఉన్నా వైయస్సార్ కాంగ్రెసు గెలుస్తుందని కెసిఆర్ నమ్ముతున్నారు. ఇదే నమ్మకంతో బిజెపి ఉంది. ఇటు తెలంగాణలో తెరాస విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

సీమాంధ్రలో వైయస్ జగన్, ఇక్కడ తాము గెలిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సులభమవుతుందని, రెండు పార్టీలు కూడా కేంద్రంలో బిజెపికి మద్దతిస్తే తమ లక్ష్యం నెరవేరుతుందని కెసిఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధిష్టానం ఎలాగూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నికల్లోగా నడుం బిగించబోదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం వ్యతిరేకంగానే ఉందని కెసిఆర్ భావిస్తున్నారు. అందువల్ల తెలంగాణలో ఆ పార్టీకి విజయం సాధ్యం కాదని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా మట్టి కొట్టుకుపోతుందని అంచనాలు వేస్తున్నారు. అందుకే, తెరాస నాయకులు తెలుగుదేశం పార్టీపై ఎక్కువగా విమర్శలు సంధిస్తున్నారు.

ఎమ్మార్ వ్యవహారంలో కూడా చంద్రబాబునే వారు తప్పు పడుతున్నారు. చంద్రబాబు తెలంగాణలో జరిపిన భూకేటాయింపులపై, ప్రభుత్వ సంస్థల దారాదత్తంపై కెసిఆర్‌కు చెందిన టి టీవీ చానెల్ వార్తాకథనం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. తన వ్యూహంలో భాగంగానే క్లిష్ట సమయంలో బిజెపి అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ జగన్‌ను వెనకేసుకొస్తూ మాట్లాడారని అంటున్నారు. రాష్ట్ర బిజెపి నాయకులు తెలంగాణ విషయంలో కెసిఆర్ వెంటే నడుస్తున్నారు.

English summary
It is learnt that BJP has a strategy to defeat Congress in AP with TRS president KCR and YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X