వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దీక్ష విరమించండి: అన్నా హజారేకు ప్రణబ్ వినతి

లోక్‌పాల్ బిల్లుపై పార్లమెంటు లోపలా, వెలుపలా చర్చ జరుగుతోందని ప్రణబ్ ముఖర్జీ లోకసభలో అన్నారు. అఖిల పక్ష సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. మొత్తం 40 అంశాల్లో 20 అంశాలపై ఒప్పందం కుదిరినట్లు ఆయన తెలిపారు. కీలకమైన ఆరు అంశాలపై భేదాభిప్రాయాలున్నాయని ఆయన చెప్పారు. లోక్‌పాల్ బిల్లుపై అభిప్రాయాలు తెలియజేయాలని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. అన్నా హజారే డిమాండ్లను కూడా పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. పార్లమెంటు అధికారాలు దెబ్బ తినకుండా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దీక్ష విరమించాలని ప్రతిపక్ష నాయకుడు ఎల్‌కె అద్వానీ కూడా అన్నా హజారేకు విజ్ఞప్తి చేశారు.