వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుష్మాపై సీమాంధ్ర ఎంపిల సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sushma Swaraj
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌పై సీమాంధ్ర ఎంపీలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈనెల 5న లోక్‌సభలో తెలంగాణ అంశంపై సావధానతీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో సుష్మాస్వరాజ్‌ సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పదిమంది సీమాంధ్ర ఎంపీలు శుక్రవారం స్పీకర్‌ మీరాకుమార్‌కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ''ఆంధ్రా, తెలంగాణ విలీనం ఎలాగుందంటే - ఒక అమాయక బాలికకు ఒక హుషారైన బాలుడితో పెళ్లి అవుతోంది. ఆయన అక్కడ ఏం చెప్పారంటే - ఆ పెళ్లి సాగకపోతే... అప్పుడు భార్యాభర్తల్లా విడివిడిగా ఉండిపోండి'' అని భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అన్నట్లు ఆమె తన ప్రసంగంలో తెలిపారు. ఆ వ్యాఖ్యలను సీమాంధ్ర ఎంపీలు తప్పుబట్టారు.

సుష్మాస్వరాజ్‌ ఉటంకించిన విధంగా నెహ్రూ ఎక్కడా మాట్లాడలేదని, ఆమె ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతిపక్ష నాయకురాలు అని,ఆమె మాట్లాడే ప్రతి పదాన్నీ దేశమే కాకుండా ప్రపంచం మొత్తం చూస్తుందని, ఆమె మాట్లాడే ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుందని, దాని పరిణామాలు విస్తృతంగా ఉంటాయని, ఆగస్టు 5న ఆమె స్వార్థ ప్రయోజనాలకోసం పాకులాడుతున్న కొందరు తెలంగాణ నాయకుల వలలో చిక్కుకున్నారని, వాళ్లు గత కొన్నేళ్లుగా తెలంగాణ అంశంపై వాస్తవ విరుద్ధమైన ప్రచారం చేస్తూ పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పని విషయాలను కూడా చెప్పినట్లు ఉటంకిస్తున్నారని సీమాంధ్ర ఎంపిలు తమ నోటీసులో అన్నారు.

సుష్మా స్వరాజ్‌పై ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, రాయపాటి, కావూరి, లగడపాటి, కిల్లి కృపారాణి, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్‌లు సంతకాలు చేశారు.

English summary
Seemandhra MPs moved privilege motion against opposition leader in Loksabha Sushma Swaraj on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X