• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్‌ను మళ్లీ వెనకేసుకొచ్చిన సుష్మా స్వరాజ్

By Pratap
|

Sushma Swaraj
న్యూఢల్లీ: ప్రభుత్వం సిబిఐని కక్ష సాధింపునకు వాడుకుంటోందని, మరణించినవారిని కూడా ఎఫ్ఐఆర్‌లో చేరుస్తోందని, ఇందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన కేసులే ఉదాహరణ అని లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నారు. ఆ రకంగా ఆమె జగన్‌ను మరోసారి వెనకేసుకొచ్చారు. లోక్‌పాల్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె శనివారం ప్రసంగించారు. సిబిఐని కాంగ్రెసు బచావో ఇనిస్టిట్యూట్‌గా మార్చేసిందని ఆమె విమర్సించారు. నోటుకు ఓటు కేసులో దోషులను కాపాడడానికి ప్రయత్నించిందని, హవాలా కేసు తమ అగ్రనేత ఎల్‌కె అద్వానీని ఇరికించడానికి ప్రయత్నించిందని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ లోకసభలో చేసిన ప్రసంగం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. జీరో అవర్ సమస్యలను లేవనెత్తడానికే తప్ప ప్రసంగాలు చేయడానికి కాదని ఆమె అన్నారు.

లోక్‌పాల్‌ బిల్లుపై లోక్‌సభ చేపట్టిన చర్చను యావత్‌ దేశం ఆసక్తిగా గమనిస్తోందని సుష్మాస్వరాజ్‌ అన్నారు. ఈ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరగడంతో చారిత్రాత్మక దినమైందని ఆమె అన్నారు. చర్చ శాంతియుత వాతావరణంలో జరగాలని ఆమె పిలుపునిచ్చారు. గత 43 ఏళ్లుగా లోక్‌పాల్‌ వచ్చినట్టే వచ్చి వెనక్కిపోతోందని ఆమె అన్నారు. గతంలో తొమ్మిదిసార్లు ఈ బిల్లు పెట్టేందుకు ప్రయత్నించారని సుష్మా వెల్లడించారు. గతంలో తమ ఎన్డీయే సర్కారు సైతం బిల్లును ప్రవేశపెట్టడంతో విఫలమైందని అన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిపై పోరులో హజారే పోరాటం చిరస్మరణీయమని ఆమె ప్రశంసించారు.

ప్రభుత్వ ప్రతిపాదిత లోక్‌పాల్‌ బిల్లుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అన్నా ఆరోగ్యం దృష్ట్యా దీక్షను విరమించుకోవాలని ఆమె కోరారు. అదే సమయంలో సమర్థవంతమైన లోక్‌పాల్‌ బిల్లును పార్లమెంటు ఆమోదించాలని సుష్మా డిమాండ్‌ చేశారు. గత రెండేళ్లుగా బయటపడిన అవినీతి కుంభకోణాలు దేశాన్ని కుదిపేశాయని సుష్మ విమర్శించారు. అవినీతి నిర్మూలనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే లోక్‌పాల్‌ బిల్లును ఆమోదించాలని సుష్మ అన్నారు. ప్రణబ్‌ ప్రకటన కొంత అసంపూర్తిగా ఉందని విమర్శించారు.

English summary
Opposition leader in Loksabha and BJP leader Sushma Swaraj once again supported YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X