• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్ జగన్ ఆస్తులపై స్వామి అగ్నివేశ్ కామెంట్స్

By Pratap
|

Swami Agnivesh
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంపాదనపై స్వామి అగ్నివేశ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం చవకబారు ఎత్తుగడని ఆయన అన్నారు. జగన్‌ సంపాదన అక్రమమని తేలితే ఆస్తులు ప్రభుత్వానికి అప్పగించాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్‌ చేశారు.

వైఎస్‌ హయాంలో వేలకోట్లు అక్రమంగా సంపాదించారని వైయస్ జగన్‌పై ఆరోపణలు ఉన్నాయని, కర్ణాటకలో గాలి సోదరులతో కలిసి అపరిమిత సంపద పోగు చేసినట్లు అనుమానాలున్నాయని ఆయన అన్నారు. సీబీఐ సోదాలు జగన్‌కు ముప్పుగా మారాయని, అందుకే స్టే కోసం సుప్రీంను ఆశ్రయించారని ఆయన విమర్శించారు. జగన్‌ ఆస్తులపై సీబీఐ విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు.

English summary
Swami Agnivesh made comments against YSR Congress president YS Jagan assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X