వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్జీరియా సరిహద్దుకు పారిపోయిన గడాఫీ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Muammar Gaddafi
ట్రిపోలి: లిబియా అధ్యక్షుడు ముమ్మార్ గడాఫీ దేశం నుండి పారిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆరు సాయుధ కార్లలో లిబియన్ అధికారులు గడాఫీని అల్జీరియాకు తీసుకు పోయినట్లుగా ఈజిప్టియన్ వార్తా సంస్థ ఒకటి తెలిపింది. అల్జీరియాలోని ఘడేమ్స్ నగరంలోకి వెళ్లే వరకు ప్రభుత్వ అనుకూల దళాలు ఆ వాహనాలకు రక్షణగా నిలిచినట్లు సమాచారం. అయితే తిరుగుబాటుదారుల దగ్గర సరైన ఆయుధాలు లేక పోవటంతో గడాఫీని ఎదుర్కోలేక పోయినట్లు తెలుస్తోంది.

కాగా అంతకు ముందే లిబియా తిరుగుబాటుదారులు ట్యునీషియా సరిహద్దులోని రసజెడిర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మార్గం మీదుగా గడాఫీ తప్పించుకుంటాడన్న యోచనతో వేట మరింత ముమ్మరం చేశారట. అయినా గడాఫీ అల్జీరియాకు పారిపోయినట్లు కథనాలు వస్తున్నాయి. ఇటీవల సైతం గడాఫీ పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని లిబియా ప్రభుత్వం ఖండించిన విషయం తెలిసిందే.

English summary
Six armoured vehicles, thought to be carrying Libyan leader Muammar Gaddafi and his sons, have crossed the Libya-Algeria border, Egypt's official news agency MENA reported on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X