వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ భయం, కొత్త ఎమ్మెల్యేలతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు మరింత మంది శాసనసభ్యులు వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని అదుపు చేయడానికి నడుం బిగించారు. మొదటిసారి శాసనసభకు ఎన్నికైన తమ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులతో ఆయన సోమవారంనాడు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. జూనియర్ శాసనసభ్యుల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుందనే వార్తల నేపథ్యంలో వారిని అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి వారికి తాయిలాలు ప్రకటించినట్లు సమాచారం. జగన్‌కు శాసనసభకు మొదటిసారి ఎన్నికైనవారే ఎక్కువగా మద్దతు తెలుపుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇప్పించడంలో జగన్ ప్రమేయం ఉండడం, వైయస్ రాజశేఖర రెడ్డి పూర్తిగా తనవారినే ఎంపిక చేయడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది.

ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశానికి దాదాపు 25 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. జగన్‌కు మద్దతుగా గతంలో మాట్లాడిన జోగి రమేష్ వంటివారు కూడా ఈ సమావేశానికి వచ్చారు. తమ తమ నియోజకవర్గాల్లో పెన్షన్లు, ఇళ్లు రేషన్ కార్డులు ఇవ్వాలని తాము కోరినట్లు జోగి రమేష్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. రచ్చబండలో ఇచ్చిన దరఖాస్తులపై కూడా చర్యలు తీసుకోవాలని తాము విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి నిధులు ఇవ్వాలని కూడా కోరినట్లు ఆయన తెలిపారు. పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలపై కూడా సమావేశంలో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తమ డిమాండ్లకు ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు.

English summary
With YSR Congress president YS Jagan fear, CM Kirankumar Reddy organized a meeting with junior MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X