హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గం రాజీనామాల ఆమోదం వైపే అడుగులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం శాససభ్యుల రాజీనామాలను ఆమోదించే దిశగానే స్పీకర్‌ ముందుకెళ్లనున్నారని తెలుస్తోంది. అనర్హత విచారణ ఎదుర్కొంటూ రాజీనామా చేసిన తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యే ఎన్‌.ప్రసన్నకుమార్‌రెడ్డి అభిప్రాయాన్ని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సోమవారం తెలుసుకున్నారు. ఇదే రీతిలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో మరో ముగ్గురు నలుగుర్ని స్పీకర్‌ ఒకటి రెండు రోజుల్లో పిలిపించి మాట్లాడతారని సమాచారం.

అనర్హత విచారణ ఎదుర్కొంటున్న మరో తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథరెడ్డి, అప్పటి ప్రజారాజ్యం ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలలో ముగ్గురు లేదా అందర్ని స్పీకర్‌ పిలిచే అవకాశం ఉంది. అనర్హత విచారణ ఎదుర్కొంటున్న వీరు రాజీనామాలు కూడా చేయడంతో వాటిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర శాసనసభలో గతంలో ఉన్న సంప్రదాయాలు, ఇంతకు ముందున్న స్పీకర్‌లు అనుసరించిన మార్గాల ప్రాతిపదికగానే ప్రస్తుత స్పీకర్‌ మనోహర్‌ కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

అనర్హత పిటిషన్లు విచారణలో ఉన్నా, సదరు సభ్యులు రాజీనామాలు చేస్తే వాటినే ఆమోదించవచ్చని సమాచారం. గతంలో తెరాస ఎమ్మెల్యేల అనర్హత కేసులో అప్పటి స్పీకర్‌ కె.ఆర్‌.సురేష్‌రెడ్డి ఇచ్చిన తీర్పు, అనుసరించిన విధానం దిశగానే మనోహర్‌ వెళ్లనున్నారు. 2008 డిసెంబరు 23న తెరాస ఎమ్మెల్యేల అనర్హతపై తీర్పు ఇచ్చారు. తొమ్మిదిమంది అనర్హత విచారణ ఎదుర్కొనగా ఆరుగురు అదే రోజు స్పీకర్‌ తీర్పునకు కొన్ని గంటల ముందు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను అప్పటికప్పుడు ఆమోదించిన స్పీకర్‌ రాజీనామా చేయని ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు.

రాజీనామాపై ప్రసన్న అభిప్రాయం తెలుసుకున్న స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ మీడియాతో మాట్లాడుతూ - రాజీనామాకు సంబంధించిన అంశంపైనే ప్రసన్నకుమార్‌రెడ్డితో చర్చించినట్లు తెలిపారు. అనర్హత వేటు కేసును ఎదుర్కొంటున్న ఏడుగురు ఎమ్మెల్యేల్లో కొండా సురేఖ మినహా అందరూ రాజీనామాలు కూడా ఇవ్వడంతో వాటి ఆమోదానికి అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary
It is said that Assembly speaker Nadendla Manohar may accept YSR Congress president YS Jagan camp MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X