• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మన ప్రజాస్వామ్యం ప్రజలకు చెందినది - పార్లమెంటుది కాదు!

By B N Sharma
|

Rajeev Chandrasekhar
ప్రభుత్వంలో సర్వ వ్యాప్తంగా వున్న అవినీతికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద అన్నా హజారే మొదలుపెట్టిన నిరసన ఉద్యమం దేశ వ్యాప్తంగా అనూహ్యరీతిలో ప్రజలను వారి మనోభావాలను దేశంలోని అవినీతి, పాలనా అసమర్ధతలపై ఉద్యమింపజేసింది.

ఆనాడు ఢిల్లీ వర్గాలు దానిని నిరసించాయి. అన్నా హజారే చేపట్టిన నిరసన ప్రదర్శనలకు స్నేహపూరితులైన పత్రికా సంపాదకులు, దానిని మొదటగా కొద్దిమంది చేపట్టిన ఆందోళన అని, తర్వాత మరోసారి దేశంలోని మధ్య తరగతి వర్గాలు చేపట్టిన ఆందోళన అని వివిధ రకాలుగా చెపుతూ వచ్చాయి. మెల్లగా ప్రారంభమైన ఈ ఆందోళన పర్వం మొదట్లో కొద్దిమందిచే నిరాకరించబడినప్పటికి తర్వాతి కాలంలో అత్యధిక ప్రజల కోపానికి, తీవ్ర అసంతృప్తికి ప్రతిరూపం అయిపోయింది.

అవినీతి వ్యతిరేక చట్టంగా ప్రతిపాదించబడి అందరి చేతా చర్చకు గురికాబడిన జన లోక్ పాల్ బిల్లులో ఇప్పటికే కొన్ని ముఖ్యమైన అంశాలు చేర్చబడ్డాయి. వాటిని మరోమారు పునరుద్ఘాటించటం కూడా సరి అయినదే.

మొదటగా - భారతదేశ ప్రజలు ఇప్పటికే వారు అనుభవిస్తున్న ప్రభుత్వ విధానాలు, పెచ్చుపెరిగిన అవినీతి మొదలగువాటిపై చెప్పలేనంత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

రెండవదిగా - పాలక వర్గం మరియు వివిధ ప్రదేశాలలోని వారి సహచరులు దేశ సమస్యలు, ప్రజల మనోభావాలతో ఎట్టి పరిచయం కలిగి వుండకపోవటం మరో విచారకర విషయం.

పైన తెలుపబడిన రెండో అంశం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. కొద్ది వారాల క్రిందట, ఢిల్లీ వర్గాలకు ప్రజలకు మద్యగల దూరం పెరిగిందని, ప్రజల ఆలోచనలు వేరుగా వున్నాయని రాయటం జరిగింది. ఢిల్లీ పాలకుల స్పందన పరిశీలిస్తే..... ప్రభుత్వ అనుకూల సంపాదకులు మొదట అన్నా హజారే ఆందోళనను మధ్య తరగతి వర్గాల ఆందోళనగా విమర్శించారు. ఇక మంత్రులు మొదట ఈ ఆందోళనకు గల నాయత్వాన్ని విమర్శించారు. అదంతా విఫలమవటంతో అన్నా హజారేను, ఆయన బృందాన్ని అరెస్టు చేశారు. అది కూడా విఫలమయ్యేసరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశీయ, విదేశీయ శక్తులు (అమెరికా, ఆర్ ఎస్ఎస్),ఇంకా ఇతర విదేశాలు భారతదేశాన్ని అల్లకల్లోలం చేయటానికి అస్ధిర పరచటానికి కుట్ర చేస్తున్నాయనే వాదనలు వినిపించారు.

(కుట్రదారులకు ఇదంటే చాలా ఇష్టం. కోట్లాది ప్రజలు ఒక విదేశీ శక్తికి లోబడి ఆందోళన చేస్తున్నారనేది ఎంతవరకు సమంజసమో గ్రహించాలి). ఇంకా మరింత వ్యతిరేకిస్తూ ఇందులో మరి కొంతమంది ఆధ్యాత్మిక గురువులు, విప్లవ రచయితలు వంటి వారు కూడా తమ తమ ప్రతిభా పాటవాలను వెల్లడించుకుంటూ జన లోక్ పాల్ బిల్లుకు వ్యతిరేకంగా విమర్శలు చేశారు. జనలోక్ పాల్ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకమంటూ రామ్ విలాస్ పాశ్వాన్ పార్లమెంటులో వివాదం చేశారు. దానిని జెడియు పార్లమెంటు సభ్యడు అలి అన్వర్ అసలైన సెక్యులరిజం అంటే ఏమిటో చూపుతూ మనమంతా గర్వపడేలా ఛాలెంజ్ చేశారు.

జరుగుతున్న ఆందోళనను అంగీకరించటానికి ఇదంతా చాలదన్నట్లు, రెండు సంవత్సరాల క్రిందట భారీ ప్రజా ఎన్నికతో ఏర్పడిన ప్రజల ప్రభుత్వం మరో నమ్మశక్యంకాని స్పందన చేసింది. మొదట, అన్నాజీ ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తుంటే, ప్రధానమంత్రి ఇటీవలే తాను అన్నాజీలో కనుగొన్న కొత్త మర్యాదను ఆయన ఆదర్శాలను గౌరవించానంటూ పార్లమెంటులో ప్రకటనలు చేశారు. బహుశ... అన్నాజీని అరెస్టు చేసి తీహార్ జైలు (ఇందులో మాజీ కేబినెట్ మంత్రులు రాజకీయ సహచరులు వున్నారు.)కు పంపినపుడు లేదా తన మంత్రులు పరిష్కారం కొరకు అన్నా చుట్టూ తిరుగుతున్నపుడు ప్రధాన మంత్రికి అన్నా విలువలు గుర్తు రాలేదనుకోవచ్చు.

తర్వాతి దశలో, ప్రభుత్వం జన లోక్ పాల్ బిల్లును పార్లమెంటులో చర్చిస్తామని రాజీపడే సూచనలిచ్చినపుడు, దాని తర్వాత మరో కాంగ్రెస్ యువనేత అవినీతి సమస్యకు తాను దీర్ఘకాల పరిష్కార ప్రతిపాదనలు రాజ్యాంగ సవరణలలో చేర్చాలని విశ్వసిస్తున్నానని సూచించినపుడు అంటే, తాను దీర్ఘకాలంలో పరిష్కారాలు చేపడతానని అప్పటిదాకా కూరుకుపోయిన అవినీతిలో జీవించండని చెపటం లాంటివి....వింటూవుంటే అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందోనని అందరికి ఆశ్చర్యం కలిగించింది.

అంతేకాదు, ఢిల్లీ పెద్దలు మరో కొత్త మంత్రాన్ని కూడా పలకటం మొదలెట్టారు - అది పార్లమెంటు సార్వభౌమత్వ సిద్ధాంతం. దీనితో, అసలు మన ప్రజాస్వామ్యం, గణతంత్రం లేదా రాజ్యాంగం లాంటివేవీ ఈపెద్దలకు అర్ధం కాలేదని ఖచ్చితంగా తెలిసిపోయింది. డా. అంబేడ్కర్ మన రాజ్యాంగాన్ని వ్రాసేటపుడు మొదటి మాటగా 'వుయ్ ది పీపుల్" (మేము ప్రజలము) అంటూ మొదలు పెట్టాడు. అంటే దాని అర్ధం ప్రజలు సార్వభౌములని. ఇక పార్లమెంటరీ సార్వభౌమత్వం అనే భావన మన ప్రజాస్వామ్యంలో ఒక భాగం....అంటే శాసన, న్యాయ వ్యవస్ధల వంటిదే పార్లమెంటు. పార్లమెంటు ప్రజలకంటే కూడా గొప్పది అని చెపటం ...రాజ్యాంగంలోని ప్రధాన లక్షణాన్ని కించపరచినట్లే.

కనుక, పార్లమెంటులో ప్రజల ప్రతినిధులుగా, మన తోటి పౌరులు ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్న ఆందోళనకు జవాబు చెపటం పార్లమెంటు సభ్యుల విద్యక్త ధర్మం. ధామస్ జెఫర్సన్ పేర్కొన్నట్లు, 'అపుడపుడూ కొద్దిపాటి విప్లవం లేవడం మంచి అంశమే. ప్రభుత్వం సరిగా పని చేయాలంటే అది ఒక మందుగా పనిచేస్తుంది". జై అన్నా!

(ఈ వ్యాసం సండే స్టాండర్డ్ లో ఆదివారం, ఆగస్టు 28,2011 నాడు ప్రచురించబడింది)

English summary
If all this didn’t have you shaking your head in disbelief and incredulity, you have other actors joining this tragicomedy –ranging from description of protesters as kool-aid drinkers by a tech guru or as Taliban by Arundhati Roy and a group of others wanting to jump onto this bandwagon not wanting to lose the sudden opportunity of publicity and visibility with their versions of bills (without even having one !), or Ram vilas Paswan in Parliament arguing that Jan Lokpal Bill was anti minority - to be challenged by Ali Anwar, JDU MP who should make us all proud of what secularism is all about – !
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X