లోక్ పాల్ బిల్లు విశ్వసనీయతకు ఏడు అంశాలు!

లక్షాలాది భారతీయులు పాల్గొని దేశ వ్యాప్తంగా నడుస్తున్నఈ ఉద్యమం అహింసాయుతంగాను, రాజకీయ జోక్యం లేకుండాను సాగటం ప్రశంసించదగినది. స్వాతంత్రం పొందిన నాటి నుండి దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ ఉద్యమం అరుదైనదిగాను, ప్రజలే భాగస్వాములుగాను వున్నారనటానకి నిదర్శనంగా నిలబడుతోంది.
నేడు తోటి పౌరులందరూ వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు, ఆందోళనలకు జవాబుగా పార్లమెంటులో ప్రజా ప్రతినిధులుగా దీనికి జవాబునివ్వటం పార్లమెంటు సభ్యుల కర్తవ్యం. అయితే ఆ పని ఎంతో భాధ్యతతో చేయవలసి వుంది.
అవినీతి అనేది పాలనా సమర్ధత లోపిస్తేను లేదా పాలన లేకుంటేను ఏర్పడుతుంది. సుప్రీం కోర్టు మేరకు అవినీతి అనేది 'అత్యంత హేయమైన మానవ హక్కుల ఉల్లంఘన". సంక్షేమ పధకాలపై సరి అయిన మార్గదర్శకతలు లేకుండా విపరీతమైన వ్యయాలు చేయడం, అసమర్ధ పాలన స్వార్ధపూరిత ప్రయోజనాలను అవినీతిని ప్రోత్సహిస్తాయి.
కనుక దృష్టి అంతా ఖచ్చితంగా పాలనా సంస్కరణలు మరియు ప్రభుత్వ విధులపై పెట్టి ప్రభుత్వం మరింత భాధ్యతతోను విలువలతోను పనిచేస్తూ ప్రజా ధనం మరియు ఆస్తులపై మంచి నియంత్రణ కలిగేలా చూడాలి. మన ప్రభుత్వ సంస్ధలు రాజకీయ జోక్యంచే స్వార్ధ ప్రయోజనాలకు వాడుకోబడి చాలా వరకు సమర్ధత లోపించివున్నాయి. ఈ వ్యవస్ధలను పునర్నిర్మించి వీటి నిర్వహణాతీరుపై మరింత నమ్మకం కలిగించాల్సిన అవసరం వుంది. దేశాన్ని న్యాయ వ్యవస్ధ, కాగ్ మొదలైనవి గర్వపడేలా చేసినట్లే, ఇతర సంస్ధలు కూడా స్వతంత్రంగాను, భాధ్యతాయుతంతగాను పనిచేసేలా మనం చేయాలి. వెబర్ మాటలలో తెలుపాలంటే, 'ప్రభుత్వ సంస్ధలను ఏర్పాటు చేయటం గట్టిబోర్డులకు మెల్లగా రంధ్రం వేయడం వంటిదే"
ఇక ఇపుడు మనం చర్చిస్తున్న లోక్ పాల్ వ్యవస్ధ దేశ ప్రజలలో విశ్వాసాన్ని పెంచటానికి మనం నిర్మించబోయే ఒక కొత్త వ్యవస్ధ.
ప్రభుత్వ లోక్ పాల్ లేదా... జన లోక్ పాల్ అంటూ అనవసరమైన మరియు తప్పుదోవ పట్టించే చర్చ సాగుతోంది. బదులుగా అసలు మనకు కావలసిన అవసరం ఏమిటనేది ప్రశ్నించుకుందాం. ఒక విశ్వసనీయమైన లోక్ పాల్ వ్యవస్ధకు కావలసిన అవసరాలు ఏమంటే:-
1. లోక్ పాల్ స్వతంత్రంగా వ్యవహరించాలి.
2. లోక్ పాల్ దర్యాప్తుకు తగినంత అధికారం ఇవ్వాలి.
3. లోక్ పాల్ కు తగినన్ని వనరులు కల్పించాలి.
4. లోక్ పాల్ వ్యవహారాలు రహస్యంగా వుండాలి.
5. లోక్ పాల్ కు అంతర్జాతీయ సహాయం ఇచ్చి పుచ్చుకునేలా వుండాలి.
6. లోక్ పాల్ ప్రొఫెషనల్ గా వ్యవహరించాలి.
7. లోక్ పాల్ వ్యవస్ధ రాజ్యాంగ బద్ధంగా వుండాలి.
పైన తెలుపబడిన ఈ 7 అంశాలను మనం కనుక లోక్ పాల్ కు అన్వయిస్తే, జన లోక్ పాల్ బిల్లు అనేది ఎంతో సమర్ధవంతమైన వ్యవస్ధగా ఏర్పడుతుంది. కఠిన చట్టాలు అవినీతికి మంచి మందు. అయితే, రాజ్యాంగపరంగా చూస్తే జన లోక్ పాల్ బిల్లు లోని కొన్ని అంశాలు ఇంకనూ పరిశీలించాల్సి వుంది. మనం ప్రాతినిధ్యం వహించే ప్రజల కోరికలు సమస్యలను వినటానికి మరియు స్పందించటానికి పార్లమెంటుకు గతంలో ఎన్నడూ లేనంత గొప్ప అవకాశం వచ్చింది.
ఈ ప్రసంగ పాఠం భారత దేశంలో నానాటికి పెరిగిపోతున్న అవినీతిపై పార్లమెంటులో జరిగిన చర్చలో రాజీవ్ చంద్రశేఖర్ చేశారు. ఆగస్టు 25, 2011.