హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమ మోసం: పిఎస్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్‌లోనే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాదులో మంగళవారం చోటు చేసుకుంది. హైదరాబాదులోని బైరామల్ గూడలో ఉంటున్న సమీర అనే యువతి ఓ యువకుడితో ప్రేమలో పడింది. వీరి ప్రేమ రెండెళ్లుగా సాగుతోంది. కొద్ది రోజుల క్రితం సమీరకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన ప్రేమికుడు సమీరను అబార్షన్ చేయించుకోమని పట్టుబట్టాడు. ప్రియుడు బలవంతం మీద ప్రెగ్నెన్సీ తీయించుకున్న సమీరకు ఆ తర్వాత అతను కనిపించడం లేదు. దీంతో ఆమె ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు పట్టించుకోక పోవడంతో పలుమార్లు పోలీసు స్టేషన్‌కు వచ్చింది. మంగళవారం ఉదయం కూడా పిఎస్‌కు వచ్చిన సమీర ఫిర్యాదు విషయమై పోలీసులను ప్రశ్నించింది. తను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ సమీర పక్కనే ఉన్న కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమీరకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు.

English summary
Young lady attempted suicide today in LB Nagan Police Station of Hyderabad for neglecting her complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X