హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గం రాజీనామాలు తెలియదా?: సిఎంకు గోనె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి పని చేస్తాయని వైయస్సార్సీ పార్టీ నేత గోనె ప్రకాశ్ రావు బుధవారం అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఓ మాట ఢిల్లీలో మరోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి నుండి కిరణ్ వెంటనే తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యుల రాజీనామాల గురించి తెలియదని కిరణ్ చెప్పడం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం పార్టీ రాజీనామాలు అంటూ మరోసారి నాటకాలాడుతోందన్నారు. మళ్లీ రాజీనామాలంటూ తెలంగాణ సాధన దిశగా కాకుండా పదవులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

English summary
YSRC party leader Gone Prakash Rao questioned CM Kiran Kumar Reddy about YS Jagan camp MLAs resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X