వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పులతో కాణిపాకం ఆలయంలోకి గల్లా అరుణకుమారి

By Pratap
|
Google Oneindia TeluguNews

Galla Arunalumari
చిత్తూరు: రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో చెప్పులతో తిరుమల ఆలయంలోకి ప్రవేశించిన ఆమె గురువారం ఉదయం అదే రీతిలో చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలోకి అడుగు పెట్టారు. చెప్పులు వేసుకుని ఆమె స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దీనిపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.

వినాయక చవితి సందర్భంగా ఆమె గురువారం ఉదయం వరసిద్ధి వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆమె వెంట తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్ కనమూరి బాపిరాజు, దేవాదాయ కమిషనర్ బలరామయ్య, ఇతర ఆలయ అధికారులు ఉన్నారు. ఆలయ సంప్రదాయాన్ని మంత్రి మంట గలిపారని భక్తులు మండిపడ్డారు.తాను కావాలని చేయలేదని, ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లనే చెప్పులు వేసుకోవాల్సి వచ్చిందని గల్లా అరుణకుమారి అన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని వివాదం చేయవద్దని ఆమె మీడియాను వేడుకున్నారు.

English summary
Minister Galla Arunakumari entered Kanipakam temple with footwear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X