వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికీలీక్స్: స్పీకర్‌పై తెలంగాణ, దళిత పిడుగులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla manohar
హైదరాబాద్: శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై తెలంగాణ పిడుగు పడింది. అలాగే, దళిత వ్యతిరేకి అనే ముద్ర పడే అవకాశాలున్నాయి. వికీలీక్స్ వెల్లడించిన సంచలన విషయాలతో నాదెండ్ల మనోహర్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి నక్సలైట్లతో సంబంధం ఉందని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు నాదెండ్ల మనోహర్ అమెరికా కాన్సులేట్‌తో చెప్పినట్లు వికీలీక్స్ వెల్లడించింది. 1969 తెలంగాణ ఉద్యమం మాదిరిగానే ప్రస్తుత తెలంగాణ ఉద్యమాన్ని కూడా తమ క్యాడర్‌ను పెంచకోవడానికి నక్సలైట్లు ప్రయత్నిస్తున్నారని, పలువురు మాజీ నక్సలైట్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని ఆయన కాన్సులేట్ జనరల్‌ ఆఫీసుతో చెప్పినట్లు వికీలీక్స్ తెలిపింది.

మాదిగ సామాజిక వర్గానికి చెందిన 30 ఏళ్ల వయస్సు పైబడిన విద్యార్థులు తెలంగాణ విద్యార్థుల జెఎసి ర్యాడికల్ సభ్యులుగా ఉన్నారని, విద్యాసంవత్సరం నష్టపోతామా, లేదా అనే ఆలోచన లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని నాదెండ్ల మనోహర్ చెప్పినట్లు కూడా వికీలీక్స్ వెల్లడించింది. దీంతో తీవ్ర ఇరకాటంలో పడిన నాదెండ్ల మనోహర్‌పై విమర్శలు వస్తున్నాయి.

నాదెండ్ల మనోహర్‌పై తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి విరుచుకుపడ్డారు. మనోహర్ తెలంగాణకు, దళితులకు వ్యతిరేకి అని ఆయన విమర్శించారు. వికీలీక్స్ కేబుల్స్ నివేదికలు వాస్తవం కాదని స్పీకర్ నిరూపించుకోవాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, నాదెండ్ల మనోహర్ వికీలీక్స్ వెల్లడించిన అంశాలను ఖండించారు. తెలంగాణ గురించి తాను ఎవరితోనూ ఎక్కడా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై వస్తున్న వార్తలు నిరాధారమని ఆయన అన్నారు. నాదెండ్ల మనోహర్‌పై వికీలీక్స్ వ్యాఖ్యలపై తాను స్పందించబోనని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.

English summary
According to Wikileaks - Nadendla Manohar, then Deputy Speaker of AP Legislative Assembly, "told CongenOff (Consulate General Office) that the police are convinced that, like in 1969, the current unrest over Telangana statehood will result in a successful recruiting campaign by Naxalite forces in the region."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X