హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు కుటుంబం ఆస్తులు రూ.39 కోట్లే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఆస్తులను శుక్రవారం మీడియా ముందు ఉంచారు. తన కుటుంబం పేర మొత్తం సుమారు రూ.39కోట్ల ఆస్తులు ఉన్నాయని, సుమారు రూ.13 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. హెరిటేజ్ కంపెనీని తాను రూ.23 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించానని చెప్పారు. హెరిటేజ్ స్థాపించింది 1992లో అన్నారు. తన పేర బ్యాంకులో రూ.40 లక్షలు ఉన్నట్లు చెప్పారు. తాను ఐదు రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తున్నానని హెరిటేజ్ ద్వారా సుమారు 4 లక్షల మంది రైతులకు ఉపాధి కలుగుతుందన్నారు. తాను ఆస్తులు కుదువ పెట్టి రుణాలపై వ్యాపారాలు చేస్తున్నట్టు చెప్పారు. వివిధ బ్యాంకుల్లో రూ.13 కోట్ల అప్పు ఉందన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ వ్యాల్యూ కారణంగా తాను మార్కెట్ విలువ ఇవ్వడం లేదన్నారు.

తన పేర ఓ ఇల్లు ఉందని అది కట్టినప్పుడు 23 లక్షలు అయిందని చెప్పారు. తన భార్య భువనేశ్వరి పేరిట పంజాగుట్టలో 650 గజాల భవనం ఉందన్నారు. 2004-2009ల మధ్య ఆస్తులు అసెంబ్లీకి సమర్పించినట్లు చెప్పారు. హెరిటేజ్ పేర 98 కోట్ల అప్పు ఉందన్నారు. తనకు శేరిలింగంపల్లిలోని మదీనగూడలో 5ఎకరాల సాగు భూమి, సజ్జాపూర్‌లో 3 ఎకరాల భూమి ఉందన్నారు. లిస్టెండ్ కంపెనీల్లో రూ.19 కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయన్నారు. తన కోసం ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి గానీ, ఒక్క ఎకరా గానీ భూమిని తీసుకోలేదన్నారు. పారదర్శకత కోసమే తన ఆస్తుల వివరాలు ప్రకటించానన్నారు. రాజకీయ నాయకులంతా తమ తమ ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రాజకీయ నాయకులు విశ్వసనీయత కోల్పోతున్నాయన్నారు. పార్టీలు విశ్వసనీయత నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం ఇతరుల ఆస్తులను తన ఆస్తులుగా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తాను ప్రకటించిన ఆస్తులకు ఎక్కువగా ఎక్కడైనా ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని ప్రకటించారు. అవసరమైన పక్షంలో ప్రతి సంవత్సరం కూడా తన ఆస్తులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. దేశంలో అవినీతి విచ్చల విడిగా పెరిగిపోయిందన్నారు.

English summary
Telugudesam Party chief Chandrababu Naidu announced his properties today. His properties Rs.39 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X