హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యసాయి ట్రస్టు నివేదికపై చర్యలు తూతూ మంత్రం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
హైదరాబాద్: సత్య సాయి ట్రస్టు ఆస్తులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికలు బుట్టదాఖలు చేసేందుకు రంగం సిద్ధమైందంటూ ఆంధ్రజ్యోతి దిన పత్రిక శుక్రవారం కథనం ప్రచురించింది. ఈ వ్యవహారంలో ఓ మంత్రితో పాటు ఓ రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుంటున్నట్లు కథనంలో ఆరోపించింది. భగవాన్ సత్యసాయి బాబు ఆసుపత్రిలో ఉన్న సమయంలో, ఆయన శివైక్యం చెందిన తర్వాత ట్రస్టుపై వెల్లువెత్తిన ఆరోపణలలో నిజానిజాలు బయటకు తీసేందుకు ప్రభుత్వం ట్రస్టుకు నోటీసులు పంపించింది. జూలై 27న ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పదిరోజుల్లోగా సమగ్ర వివరాలు అందించాలని ట్రస్టును ఆదేశించింది. అయితే జూలై 11న ట్రస్టు కొన్ని బస్తాలను తీసుకొచ్చి ప్రభుత్వం ముందు పడేసింది.

బస్తాల కొద్దీ పత్రాలను పంపడంతో వాటిని పరిశీలించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ పత్రాలను పరిశీలించిన కమిటీ అందులో ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్కదానికీ సరైన, సంతృప్తికరమైన సమాధానం లభించలేదని గుర్తించినట్లు తెలిసింది. ట్రస్టుకు సంబంధించిన పలు విషయాలతో పాటు ప్రభుత్వం అడిగిన వాటికి అందులో సమాధానం లేదని భావించిన కమిటీ మరికొన్ని అనుబంధ ప్రశ్నలు వేయాలని అందుకు ట్రస్టుకు మరోసారి నోటీసులు జారీ చేయాలని వారు భావించినట్లుగా తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ఓ నివేదిక తయారు చేసి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి సమర్పించారు. అది చివరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చేరింది.

మరోసారి నోటీసులు జారీ చేయాలంటే సిఎం నిర్ణయం తీసుకోవాలి. అయితే నివేదిక వచ్చినప్పటికీ ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లుగా కనిపిస్తోంది. ఆదాయపన్ను శాఖ నుంచి కూడా ఎలాంటి కార్యాచరణ లేనట్లుగా కనిపిస్తోంది. ఇలా మరోసారి నోటీసులు జారీ చేసి ట్రస్టును మరోసారి బజారుకీడ్చకుండా ఉండేందుకు ఓ మంత్రి, ఓ రాష్ట్ర గవర్నర్ ఉన్నట్లుగా కథనంలో పత్రిక అనుమానాలు వ్యక్తం చేసింది. ఒత్తిళ్లలో భాగంగానే ప్రభుత్వం కమిటీ సిఫార్సులపై మౌనం వహిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

English summary
It seems, AP state government is neglecting on Sathya Sai Baba trust report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X