వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా దౌత్య రహస్యాల గుట్టురట్టు చేసిన వికీలీక్స్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Julian Assange
లండన్: అగ్రరాజ్యం అమెరికా రహస్యాలను బట్టబయలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న వికీలీక్స్ వెబ్‌సైట్ తాజాగా మరో బాంబు పేల్చింది. అమెరికాకు చెందిన 2.50 లక్షల దౌత్యపరమైన రహస్య కేబుల్స్(పత్రాలు)ను ఇంటర్‌నెట్‌లో ఉంచినట్లు శుక్రవారం ప్రకటించింది. అమెరికాకు ముందుగా చెప్పి మరీ ఈ కేబుల్స్‌ను విడుదల చేసిన వికీలీక్స్ ఆ దేశం, హక్కుల సంఘాలు, మీడియా మిత్రుల హెచ్చరికలను బేఖాతరు చేసింది. 45 ఏళ్ల అమెరికా దౌత్య రహస్యాలు ఉన్న 2,51,287 కేబుల్స్‌ను ఎలాంటి పాస్‌వర్డ్ లేకుండానే అందరూ సులభంగా పొందవచ్చని ఆ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పేర్కొంది. వీటన్నింటినీ శుక్రవారం ఉదయమే విడుదల చేశామని, వాటిని అందరూ చదివి, ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవాలని కూడా తన మద్దతుదారులను కోరింది. అయితే కొద్దిసేపట్లోనే వెబ్‌సైట్‌కు సందర్శకుల తాకిడి పెరిగి అది స్తంభించిపోయిందని బీబీసీ తెలిపింది. అఫ్ఘాన్, పాక్, ఇరాన్, వెనిజులాతో అమెరికాకు గల సంబంధాలపై కూడా ఈ పత్రాల్లో సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సమాచారమిచ్చినవారి పేర్లు, వివరాలు వెల్లడిస్తే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందంటూ గురువారం అమెరికా, మానవహక్కుల సంఘాలు వికీలీక్స్‌ను హెచ్చరించాయి.

అమెరికా దౌత్య కేబుల్స్‌ను యథాతథంగా విడుదల చేయడంపై వికీలీక్స్ మీడియా భాగస్వాములైన నాలుగు పత్రికలు తీవ్రంగా స్పందించాయి. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆ వెబ్‌సైట్ అధినేత జూలియస్ అసాంజే ఒక్కరే ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారంటూ ద గార్డియన్, న్యూయార్క్ టైమ్స్, జర్మన్ పత్రిక డెర్ స్పీగల్, స్పానిష్ డైలీ ఎల్ పైస్ మండిపడ్డాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఆ సైట్‌కు దూరమవుతున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి. కాగా గతవారం 1.34 లక్షల కేబుల్స్‌ను ఎలాంటి మార్పులు చేయకుండా పేర్లు, వివరాలతో సహా విడుదల చేయడంపై అమెరికా మండిపడింది. అయితే గార్డియన్ పత్రిక జర్నలిస్టుల్లో ఒకరు పాస్‌వర్డ్ లేకుండా కేబుల్స్‌ను లీక్ చేశారంటూ వికీలీక్స్ ఆరోపణలు గుప్పించడంతో, ఆ పత్రిక తీవ్రంగా ఖండించింది.

English summary
Wikileaks says all 251,287 of the leaked diplomatic cables are now online in a searchable format. It comes amid a row between Wikileaks and the Guardian newspaper over who was behind the earlier release of thousands of unredacted cables.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X