వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాహజారే బృందానికి కేంద్రం షాక్ మీద షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prashant Bhushan
న్యూఢిల్లీ: అన్నాహజారే బృందానికి కేంద్రం షాక్ మీద షాక్ ఇస్తోంది. ఎంపీలపై అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఇటీవల మాజీ ఐపిఎస్ అధికారిణి కిరణ్ బేడీ, సినీ నటుడు ఓంపురికి కేంద్రం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు పంపించింది. దానికి ఓంపురి బహిరంగ క్షమాపణ చెప్పినప్పటికీ కిరణ్ బేడీ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. అయితే శనివారం అన్నా బృందంలోని ప్రశాంత్ భూషణ్‌కూ శనివారం సభా హక్కుల నోటీసులు జారీ అయ్యాయి.

14వ తేది లోగా సమాధానం చెప్పాలని ప్రశాంత్ భూషణ్‌ను రాజ్య సభ సెక్రటరియేట్ కోరింది. ఎంపీలను కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎంపీ మహ్మద్ అబీబ్ ఇచ్చిన నోటీసు ప్రకారం నోటీసులు జారీ అయ్యాయి. అన్నా బృందంలోని కేజ్రీవాల్‌కు ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపించింది. కాగా కేంద్రం అవినీతిపై అన్నాకు సహకరించిన అందరిపై ఒక్కొక్కరిగా టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. కాగా గతంలో విదేశాల్లోని నల్లడబ్బు వెనక్కి రప్పించాలని ఉద్యమించిన బాబా రామ్‌దేవ్ ఆస్తుల పైనా ఈడి దర్యాఫ్తుకు సిద్ధపడిన విషయం తెలిసిందే.

English summary
Lawyer Prashant Bhushan on Saturday said he has received a breach of privilege notice for his remarks against parliamentarians, the second Team Anna member to get such a notice, Times Now reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X