హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు అప్పులు ఇప్పుడు ఆస్తులు: కెసిఆర్‌పై వేం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ పెట్టక ముందు ఆయనకు లక్షల అప్పు ఉండేదని పార్టీ స్థాపించిన తర్వాత ఆయనకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని తెలుగుదేశం పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి శనివారం ప్రశ్నించారు. పార్టీ పెట్టక ముందు అప్పుల్లో ఉన్న కెసిఆర్, ఆయన తనయుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావుకు ఓ ఛానల్, పేపర్ ఎలా పెట్టారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఆస్తులను ప్రకటించినట్లుగా కెసిఆర్, కెటిఆర్ సైతం తమ ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగ సంక్షోభం కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేద్దామని చెబితే టిఆర్ఎస్ ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో దురుద్దేశ్యంతోనే టిడిపిపై టిఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై లేఖ ఇస్తే కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రకటిస్తానని హామీ ఇస్తే లేఖ రాసిస్తారన్నారు. తెలంగాణకు తెలుగుదేశం పార్టీయే అడ్డంకి అనే ముద్ర వేసేందుకు టిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందన్నారు. కానీ ప్రజలకు నిజా నిజాలు తెలుసన్నారు.

English summary
Telugudesam Party leader Vem Narender Reddy fired at TRS chief K Chandrasekhar Rao and MLA K Taraka Rama Rao today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X