వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి అరెస్టు: సుష్మా స్వరాజ్‌పై దిగ్విజయ్ ఆరోపణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sushma Swaraj and Digvijay Singh
న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టయిన నేపథ్యంలో కాంగ్రెసు నాయకుడు దిగ్విజయ్ సింగ్ బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్‌లో సుష్మా స్వరాజ్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారంతో సుష్మాకు వ్యాపార ప్రయోజనాలున్నాయని ఆయన సోమవారం అన్నారు. రెడ్డి సోదరులతో బిజెపి నేత వెంకయ్యనాయుడికి కూడా వ్యాపార ప్రయోజనాలున్నాయని ఆయన ఆరోపించారు. సుష్మా స్వరాజ్ పాత్రపై కూడా దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, దిగ్విజయ్ సింగ్ ఆరోపణలను సుష్మా స్వరాజ్ ఖండించారు. గాలి సోదరులకు తాను సహకరించలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు. దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో విచారణ జరిపించినా తనకు అభ్యంతరం లేదని ఆమె అన్నారు. గాలి బ్రదర్స్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో తన పాత్రపై విచారణ జరిపించాలని ఆమె ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరారు.

English summary
Outspoken Congress general secretary Digvijay Singh, Monday, dragged senior BJP leader Sushma Swaraj into the illegal mining issue involving the Reddy brothers of Bellary by demanding that her role should be probe too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X