వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరెస్టుకు ముందు రెండు కోట్ల బంగారు కుర్చీలో గాలి

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బళ్లారి‌: సిబిఐ సోమవారం ఉదయం అరెస్టు చేయడానికి ముందు కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి రెండు కోట్ల రూపాయల విలువ చేసే బంగారం కుర్చీలో కూర్చున్నారు. ఈ మేరకు కొన్ని టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. ఆయన ఇళ్లంతా బంగారం పనిముట్లతో నిండి ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. బళ్లారిని దాదాపుగా తమ ఎస్టేట్‌గా మార్చుకున్న గాలి సోదరులు దక్షిణాదిన తొలిసారి బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు పునాదులు వేశారనే ప్రశంసను పార్టీ నుంచి దక్కించుకున్నారు. తన ఆస్తుల విలువ వేయి కోట్ల రూపాయల దాకా ఉంటుందని గాలి జనార్దన్ రెడ్డి ఒకానొక సందర్భంలో ప్రకటించుకున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి తండ్రి చెంగారెడ్డి ఓ కానిస్టేబుల్. కడప జిల్లాకు చెందిన గాలి సోదరులు బళ్లారిలో స్థిరపడ్డారు. అక్కడ ఓ ఫైనాన్స్ సంస్థను నడిపారు. దాని వల్ల 1995లో ఫైనాన్స్ కంపెనీ 200 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. 2004లో మొదటిసారి ఇనుప ఖనిజం తవ్వకాల లీజును గాలి సోదరులు పొందారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అది జరిగిందని అంటారు. అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఆస్తుల విలువ 115 కోట్ల రూపాయలు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఇనుప ఖనిజాలను లీజుకు తీసుకున్న తర్వాత అక్రమ తవ్వకాలు మితిమీరిపోయాయనే ఆరోపణలు వచ్చాయి.

గాలి జనార్దన్ రెడ్డి 2009లో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి 42 కోట్ల రూపాయల విలువ చేసే వజ్రపు కిరీటాన్ని ప్రదానం చేశారు. అదే ఏడాిది గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో ఓ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెబుతారు. ఈ పెళ్లికి పది వేల మందికి పైగా అతిథులు హాజరయ్యారు. గాలి సోదరులు అక్రమ మైనింగ్ ద్వారా 215 కోట్ల రూపాయలు ఆర్జించారని కర్ణాటక లోకాయుక్త తప్పు పట్టింది.

English summary
Before arrest Gali Janardhan Reddy sat in his gold chair, which costs about Rs 2 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X