వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంచల్‌గుడా జైలుకు గాలి జనార్దన్ రెడ్డి తరలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali janardhan Reddy
హైదరాబాద్‌: అక్రమ మైనింగ్ కేసులో నిందితులు గాలి జనార్దన్ రెడ్డిని, ఒఎంసి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని సోమవారం సాయంత్రం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలుకు తరలించారు. గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 19 వరకు రిమాండ్‌ విధించింది. బెంగళూరులో అరెస్టుచేసిన గాలి, శ్రీనివాసరెడ్డిలను సీబీఐ అధికారులు ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం న్యాయవాదులు, మీడియా ప్రతినిధులతో కిక్కిరిసిపోయింది. కేసు విచారణను సిబిఐ ఎల్లుండికి వాయిదా వేసింది. గాలి జనార్దన్ రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఎల్లుండి కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాదులను ఆదేశించింది.

దర్యాప్తులో సీబీఐకి గాలి జనార్దనరెడ్డి పూర్తిగా సహకరిస్తారని ఆయనకు వెంటనే బెయిల్‌ మంజూరు చేయాలని గాలి తరఫు న్యాయవాదులు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో గాలి పేరులేకపోయినప్పటికీ సమాచారం లేకుండా ఎలా అరెస్టు చేశ్తారని న్యాయవాది ప్రశ్నించారు. ఓఎంసీ రోజువారీ కార్యకలాపాలతో జనార్దనరెడ్డికి ఎటువంటి సంబంధంలేదని గాలి న్యాయవాదులు తెలిపారు. ఎండీ హోదాలో శ్రీనివాసరెడ్డి మాత్రమే ఓఎంసీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని వార వెల్లడించారు.

English summary
Gali Janardhan Reddy shifted to Chanachalguda jail, as CBI court remanded till september 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X