హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయసుధ, సురేఖ తెలంగాణపై మళ్లీ రాజీనామాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayasudha-Konda Surekha
హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యురాళ్లు కొండా సురేఖ, జయసుధ, కుంజా సత్యవతి మళ్లీ రాజీనామాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. సిబిఐ ఎఫ్ఐఆర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు నిరసనగా వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులంతా రాజీనామాలు చేసినప్పుడు వీరు రాజీనామాలు చేయలేదు. గతంలో తెలంగాణ కోసం వారు రాజీనామాలు చేశారు. అయితే వాటిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంతకు ముందే తిరస్కరించారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ కోసం రాజీనామాలు చేయాలని వారు అనుకుంటున్నారు.

తెలంగాణ కోసం తాము చేసిన రాజీనామాలను ఎందుకు అంగీకరించలేదో స్పీకర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని జయసుధ ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. తెలంగాణ కోసం మళ్లీ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉన్నారు. కాగా, కుంజా సత్యవతి కొండా సురేఖతో మంతనాలు జరుపుతున్నారు. కొండా సురేఖ శాసనసభకు వచ్చి తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశాలున్నాయి. తెలంగాణకు చెందిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైయస్సార్ పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చినందుకు కాకుండా తెలంగాణ కోసం రాజీనామాలు చేయాలని అనుకుంటున్నారు.

English summary
YSR Congress president YS Jagan camp MLAs Konda Surekha, Jayasudha and Kunja Sathyavathi will resign again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X