వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలతోనూ స్పీకర్ అదే మాట

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla manohar
హైదరాబాద్‌: తెలంగాణ కోసం రాజీనామాలు సమర్పించిన శాసనసభ్యులకు చెప్పిన మాటనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులకూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వినిపించారు. గుర్నాథరెడ్డి, రామచంద్రా రెడ్డి మినహా జగన్ వర్గానికి చెందిన 27 మంది శాసనసభ్యులు సోమవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. నిబంధనల ప్రకారం రాజీనామాలను పరిశీలిస్తానని స్పీకర్ వారికి హామీ ఇచ్చారు. విడివిడిగా మాట్లాడిన తర్వాత రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.

కుంజా సత్యవతి, కొండా సురేఖ, జయసుధ రాజీనామా లేఖలు తన వద్ద లేవని, వాళ్లు మళ్లీ రాజీనామాలు చేస్తే పరిశీలిస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని పడేయాలని తాము రాజీనామాలు చేయలేదని స్పీకర్‌తో భేటీ అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాము మనస్ఫూర్తిగానే రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. రాజీనామా పత్రంలోనూ మౌలికంగానూ వైయస్సార్ పేరు తాము ప్రస్తావించలేదని ఆయన అన్నారు. తాము రేపు గవర్నర్‌ను కలుస్తామని, సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో వైయస్సార్ పేరు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అపిడవిట్ దాఖలు చేయకపోవడాన్ని గవర్నర్ దృష్టికి తెస్తామని ఆయన చెప్పారు. వైయస్ జగన్ బయటపడతారనే ఉద్దేశంతోనే ఎఫ్ఐఆర్‌లో వైయస్ పేరు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం లేదని ఆయన విమర్శించారు.

కాగా, కాంగ్రెసు శాసనసభ్యుడు వీరశివారెడ్డి మాటలు పట్టించుకోవద్దని ఆయన అన్నారు. తమ వెంట మరింత మంది శాసనసభ్యులు వస్తారని జగన్ వర్గం చెప్పుకోవడాన్ని వీరశివారెడ్డి ఎద్దేవా చేశారు. తమ వెంట 30 మంది శాసనసభ్యులు వస్తారని వైయస్ జగన్ వర్గం చెబుతోందని, మరో ముగ్గురు వస్తే తాను కూడా జగన్ వెనక చేరుతానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

English summary
YSR Congress president YS Jagn camp MLAs meet Assembly speaker Nadendla Manohar and appealed to accept resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X