వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ రాజకీయ నేతలు జైలు పక్షులు, మరింత మంది

By Pratap
|
Google Oneindia TeluguNews

Scam
న్యూఢిల్లీ: ఈ ఏడాది రాజకీయ నాయకుల జాతకం ఏమంత బాగున్నట్లు లేదు. ఆర్థిక సంస్కరణలకు తలుపులు బార్లా తెరవడంతో, ప్రైవేటీకరణ ఊపందుకోవడంతో దొడ్డి దారిన సంపాదించుకునేందుకు రాజకీయ నాయకులకు అవకాశాలు పెరిగాయి. పలు కుంభకోణాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. అయితే, అదే స్థాయిలో అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కుంభకోణాల్లో చిక్కుకున్న రాజకీయ నాయకులు కూడా జైలు పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది.

అరెస్టయి జైలు పాలవుతున్న రాజకీయ నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు జరిగింది. దీంతో అరెస్టుల పరంపర ఆగేట్లు లేదు. అది మరింత పెరిగే అవకాశం ఉంది.

అరెస్టయి జైలు ఊచలు లెక్కిస్తున్న రాజకీయ నేతలు

ఎ రాజా - డిఎంకె, టెలికం మాజీ మంత్రి, 2001 ఫిబ్రవరి 2వ తేదీన అరెస్టయ్యారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఐ అరెస్టు చేసింది.

సురేష్ కల్మాడి - కాంగ్రెసు, సిడబ్ల్యుజి మాజీ చీఫ్, 2001 ఏప్రిల్ 25వ తేదీన సిడబ్ల్యుజి కుంభకోణం కేసులో సిబిఐ అరెస్టు చేసింది.

ఎంకె కనిమొళి - డిఎంకె నేత, 2011 మే 20వ తేదీన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఐ అరెస్టు చేసింది.

కట్టా సుబ్రహ్మణ్య నాయుడు - బిజెపి, కర్ణాటక మాజీ మంత్రి, 2001 ఆగస్టు 8వ తేదీన భూ కుంభకోణం కేసులో కర్ణాటక లోకాయుక్త అరెస్టు చేసింది.

గాలి జనార్దన్ రెడ్డి - బిజెపి, కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ మైనింగ్ కుంభకోణం కేసులో సెప్టెంబర్ 5వ తేదీన సిబిఐ అరెస్టు చేసింది.

అమర్ సింగ్ - రాజ్యసభ సభ్యుడు, ఎస్పీ మాజీ ప్రధాన కార్యదర్శి, నోటుకు ఓటు కేసులో సిబిఐ సెప్టెంబర్ 6వ తేదీన అరెస్టు చేసింది.

అరెస్టు అవుతారని భావిస్తున్న రాజకీయ నాయకుల జాబితాలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు బిఎస్ యడ్యూరప్ప, హెచ్‌డి కుమారస్వామి, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ ఉన్నారు.

English summary
While the current ruling party UPA is trying hard to take on the issues of corruption, inflation amongst many other for the development of the country's economy, the scam tainted politicians who seem to be walking to jail every other day, only leave one wondering if India would ever be able to come clean of its leaders who are always in the dock following allegations of corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X