హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామాకు సిద్ధపడిన ఎమ్మెల్యే ముత్యం రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Muthyam Reddy
హైదరాబాద్: మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి చెందిన సీనియర్ శాసనసభ్యుడు ముత్యం రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని మంగళవారం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కోసం ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలంటూ తన నియోజకవర్గంలోని ప్రజలు తనపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నందు వల్లే తాను రాజీనామాలు చేస్తున్నానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి బస్వరాజు సారయ్య, మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిలకు వివరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కోసం రాజీనామా చేయకుంటే నియోజకవర్గంలో తిరిగే ప్రసక్తి లేదని అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని వారికి వివరించినట్లుగా సమాచారం.

ముత్యంరెడ్డి రాజీనామా చేస్తారనే వార్తలు రావడంతో మంత్రి సారయ్య, ఎమ్మెల్యే గండ్ర రంగంలోకి దిగారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం అందుకు ససేమీరా అన్నారని సమాచారం. ముత్యం రెడ్డి ముఖ్యమంత్రితో సమావేశమై ఆ తర్వాత వెళ్లి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కే నేరుగా రాజీనామా సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇటీవల ముత్యం రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో పలుమార్లు తెలంగాణవాదులు ఆయనపై దాడులు చేశారు.

English summary
Senior mla Muthyam Reddy ready to resign for Telangana today. He met CM Kiran Kumar Reddy, Gandra Venkata Ramana Reddy and minister Baswaraj Saraiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X