వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ హైకోర్టు వద్ద బాంబు పేలుడు, 12 మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Delhi High Court
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని హైకోర్టు వద్ద బుధవారం ఉదయం బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 12 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. హోం శాఖ ఈ మరణాల సంఖ్యను ధ్రువీకరించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో సుమారు 45 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం పది గంటల నుండి 10.30 గంటల మధ్య పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. కోర్టు ప్రాంగణంలో పార్కు చేసిన కారులో పేలుడు సంభవించింది. ఢిల్లీ హైకోర్టు వద్ద భారీగా భద్రత లేక పోవడమే ఈ పేలుడుకు కారణమని తెలుస్తోంది. కోర్టు వద్ద భారీ సెక్యూరిటీ లేదని సమాచారం. అంతేకాకుండా ఇటీవల కోర్టు కాంపౌండ్ వాల్‌ను పగుల గొట్టారు. దీంతో ఎవరైనా లోనికి వెళ్లడానికి ఆస్కారం ఉంది. ఇలాంటి భద్రతా లోపం కారణంగానే పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీలో గత మూడు నెలల కాలంలో ఇది రెండో పేలుడు. పేలుడు కారణంగా ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. గేటు నంబర్ 5 వద్ద పేలుడు జరిగింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు జరిగిన చోట క్షతగాత్రులు ఎగిరి పడ్డారు. గాయపడ్డ వారిలో పలువురు లాయర్లు కూడా ఉన్నారు. పేలుడు జరగగానే లాయర్లు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి రెండు ఫైరింజన్లు, పోలీసులు, అంబులెన్సు చేరుకున్నాయి. గాయపడ్డ వారిని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఓ డబ్బాలో బాంబు పెట్టి కారులో అమర్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో నుండి భారీగా పేలుడు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.

English summary
An explosion has been reported outside gate No. 5 of the Delhi high court. Around 45 people are reportedly injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X