హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ప్రత్యేక కోర్టు రేపటికి వాయిదా వేసింది. గాలి జనార్దన్ రెడ్డిని తమ కస్టడీకి కోరుతూ సిబిఐ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ కూడా రేపటికి వాయిదా పడింది. కేసు విచారణను సోమవారానికి వాయిదా వేయాలని గాలి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాది కోరారు. అయితే, అంత సమయం ఇవ్వలేమని కోర్టు తెలిపింది.

ఢిల్లీ హైకోర్టు వద్ద పేలుడుకు నిరసనగా అన్ని కోర్టుల్లో న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. దీంతో గాలి జనార్దన్ రెడ్డి కేసులు రెండు కూడా రేపటికి వాయిదా పడ్డాయి. గాలి జనార్దన్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పటిషన్‌పై వాదనలు దాదాపు పూర్తయ్యాయి. దీనిపై రేపు కోర్టు నిర్ణయం వెలువడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

English summary
Hearing on Gali Janardhan Reddy's bail petition and CBI custody petition adjourned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X