హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: మైనింగ్ అక్రమాల కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై, సిబిఐ కస్టడీ పిటిన్‌పై నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా పడింది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ నిరాకరించాలని, గాలి జనార్దన్ రెడ్డినీ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డినీ తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోరుతోంది. గాలి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టింది.

ఒఎంసి అక్రమ తవ్వకాలకు పాల్పడిందని చెప్పడానికి వీలైన కీలకమైన ఆధారాలను, నాలుగు ఉపగ్రహ ఛాయాచిత్రాలను సిబిఐ నాంపల్లి కోర్టుకు సమర్పించింది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ స్వయంగా వాటితో కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ ఇస్తే గాలి జనార్దన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని సిబిఐ వాదిస్తోంది. కాగా, గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని కనీసం 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి.

English summary
Hearing on Gali Janardhan Reddy's bail petition and on CBI custody petition adjourned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X