వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాడిస్టు భర్త: సైంటిస్ట్‌కూ తప్పని వేధింపులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakaptnam
విశాఖపట్నం: శాడిస్టు భర్త కారణంగా ఓ సైంటిస్టుకూ వేధింపులు తప్పలేదు. న్యూఢిల్లీలో సైంటిస్టుగా పని చేస్తున్న అనిత అనే యువతికి గత సంవత్సరం పెళ్లయింది. పెళ్లైన మొదటి రోజు నుండే అత్తింటి తనను తన అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ ఛానల్ వద్ద మొర పెట్టుకుంది. తనకు పెళ్లైన రోజు నుండే అత్తింటి వారి నుండి వేధింపులు ఉన్నాయన్నారు. రూ.30 లక్షల అదనపు కట్నం తీసుకు రావాలని భర్త తనను చిత్రహింసలకు గురి చేశారన్నారు. గతంలోనూ రెండుసార్లు అదనపు కట్నం కోసం తనను వేధించారన్నారు.

అదనపు కట్నం కోసం బాగా హింసించే వారన్నారు. తన భర్త తరఫు కుటుంబమంతా పెద్ద శాడిస్టు కుటుంబమని ఆరోపించించింది. తనను ఎప్పుడు ఓ కోడలిలా కనీసం మనిషిలా ట్రీట్ చేయలేదన్నారు. తాను ఢిల్లీలో పని చేస్తుండగా అప్పుడప్పుడు వచ్చి తన జీతం మొత్తాన్ని తీసుకు వెళ్లే వారని చెప్పారు. తన భర్త నిత్యం ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని, కేవలం డబ్బు చూసే పెళ్లి చేసుకున్నానని నిత్యం తనను వేధించే వాడని చెప్పారు. ఇటీవల తన క్యారెక్టర్ పైనా నిందలు వేయడం ప్రారంభించారన్నారు. తన భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. తనను వదిలించుకొని ఎక్కువ కట్నం ఇచ్చే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారన్నారు. తనలా మరో అమ్మాయి బలి కాకూడదనే తాను మీడియా ముందుకు వచ్చానన్నారు.

English summary
A husband tourcherd his scientist wife for extra dowry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X