వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను చాలా డిఫరెంట్: సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తాను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదని తాను సగటు రాజకీయ నాయకులకు డిఫరెంట్ అని ముఖ్యమంత్రి కిరణ్ కుమర్ రెడ్డి ఆదివారం అన్నారు. ఓమాట చెప్పానంటే అచరించి చూపిస్తానన్నారు. నేను చెప్పే ప్రతిమాట నిబద్దతతో చెబుతానన్నారు. 14ఎఫ్ రద్దు నా కమిట్‌మెంట్‌కు నిదర్శనమన్నారు. డిసెంబర్ ఆఖరు లోగా లక్ష ఉద్యోగాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పారు. లంచగొండితనం నిర్మూలించేందుకు త్వరలో వినూత్న కార్యక్రమం చేపడతామన్నారు. ఒకే కేంద్రంలో 20 రకాల సర్టిఫికేట్లు అందజేసేందుకు కృషి చేస్తామన్నారు.

అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులను కఠినంగా శిక్షించాలన్నారు. అవినీతికి పాల్పడ్డ నేతలు కొందరు ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లారన్నారు. రాజకీయ నాయకులకు అత్యాశ ఉండకూడదన్నారు. అవినీతిపై లోక్ పాల్ వంటి ఎన్ని చట్టాలు చేసిన ఫలితం ఉండదన్నారు. పారదర్శక పాలనతోనే అది సాధ్యమవుతుందన్నారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పాఠశాలల్లో అహింసపై పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. గెలిచిన వారికి భారీ పారితోషికం ఉంటుందన్నారు. కాగా అంతకుముందు అపోలోలో చికిత్స పొందుతున్న ఎంపీ అజహరుద్దీన్ తనయుడు అయాజుద్దీన్‌ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంచి చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

English summary
CM Kiran Kumar Reddy said today that he is very different with all the political leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X