వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి అరెస్టుకు వాస్టు దోషమే కారణమా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుకు వాస్తు దేషమే కారణమని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తోన్నట్లుగా కనిపిస్తోంది. అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాడంటూ ఇటీవల గాలి జనార్ధన్ రెడ్డిని సిబిఐ అధికారులు ఆయన ఇంట్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంటికి ఉన్న వాస్తు దోషం కారణంగానే గాలి అరెస్టు జరిగిందని కుటుంబ సభ్యులు గాఢంగా నమ్ముతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే రెండు రోజులుగా పండితులను పిలిపించి వాస్తుకనుగుణంగా ఇంటికి మార్పులు చేస్తున్నారు. ప్రత్యేక పూజలు జరిపి హోమాలు నిర్వహించారు. అనంతరం ఆగ్నేయం వైపు వాస్తు దోషం ఉన్నట్లు జ్యోతిష్కులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో నివాసం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ ప్రధాన గేటును శనివారం సాయంత్రం మూసివేశారు. ఆ గేటును దక్షిణం వైపుకు మార్చనున్నట్లు తెలుస్తోంది.

గాలి 2003 నుండి అదే ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు మూసివేసిన ప్రధాన రహదారి నుండే రాకపోకలు సాగిస్తున్నారు. పండితుల సూచనల మేరకు గాలికి ఎలాంటి శిక్షలు పడకుండా పూజలు నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. కాగా జనార్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ సోమవారం సిబిఐ కోర్టులో విచారణకు రానుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాయంత్రానికే నిర్మాణం పూర్తి చేశారని తెలుస్తోంది. కోటలాంటి ఈ ఇంటిని గాలి తన కోసం కాకుండా తన సన్నిహితుడు శ్రీరాములు కోసం నిర్మించారు. అయితే వాస్తును బాగా నమ్మె గాలి ఆ ఇళ్లు వాస్తు ప్రకారం ఉందని తెలిసి ఆయనే నివాసం ఉంటున్నారు.

English summary
It seems, Karnataka former minister Gali Janardhan Reddy family members suspecting that vastu dosam is caused to Gali arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X