వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు సెప్టెంబర్ 11 టెన్షన్, చొరబడ్డ ముగ్గురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

9/11 Terror Attack
వాషింగ్టన్: పదేళ్ల క్రితం సెప్టెంబర్ 11వ తేదీన అమెరికా వణికి పోయింది. ఉగ్రవాద దాడితో జంట శిఖరాలు నేలమట్టమయ్యాయి. ఆ టెన్షన్ అమెరికాను ఇప్పుడు కూడా పట్టుకుంది. సెప్టెంబర్ 11 ఆదివారం నాటికి దాడికి సరిగ్గా పదేళ్లు అయిన సమయంలోఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక అమెరికా దడదడలాడుతోంది. ముగ్గురు దుండగుల కోసం అమెరికా పోలీసులు అణువణువునా గాలిస్తున్నారు. వారు అమెరికా పౌరులైనా కావొచ్చు. అమెరికా వీసాతో దేశంలోకి వచ్చిన వారైనా కావొచ్చు. ఆ ముగ్గురు న్యూయార్క్ లేదా వాషింగ్టన్‌లో వీలైనంతా భారీ విధ్వంసం సృష్టించవచ్చని అంత్యత విశ్వసనీయమైన, నిర్దిష్టమైన సమాచారం అందింది. ఆ ముగ్గురిలో ఇద్దరు కచ్చితంగా అమెరికా పౌరులే అని కూడా తెలుస్తోంది.

"9/11 పదో 'వార్షికోత్సవాన్ని' కళ్లు చెదిరే దాడుల'తో జరుపుకోవాలని అల్ కాయిదా కొత్త చీఫ్ అల్ జవహరి నిర్ణయించుకున్నారు. బిన్ లాడెన్ మరణానికి తగిన ప్రతీకారం తీసుకోవాలని తీర్మానించారు. ఈ బాధ్యతను ముగ్గురికి అప్పగించాడు'' అని పాక్ వాయవ్య ప్రాంతానికి చెందిన సీఐఏ ఇన్‌ఫార్మర్ ఒకరు సమాచారం అందించారు. దీంతో ఆ ముగ్గురి కోసం అమెరికా భారీ స్థాయిలో వేట ప్రారంభించింది. ఆ ముగ్గురూ అరబ్ సంతతికి చెందిన వారేనని... అరబ్బీతోపాటు ఇంగ్లీషుకూడా ధారాళంగా మాట్లాడగలరని భావిస్తున్నారు. ముంబై నుంచి న్యూయార్క్‌దాకా అనేక దేశాల్లోని అనేక నగరాలను అమెరికా విదేశాంగ శాఖ అప్రమత్తం చేశారు.

దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, అణు కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. న్యూయార్క్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన కమెండోలు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. అన్ని ప్రధాన చౌరస్తాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దాడుల ముప్పు పొంచి ఉన్నప్పటికీ... న్యూయార్క్‌లోని గ్రౌండ్ జీరోతోపాటు వర్జీనియా, పెన్సిల్వేనియాలలో స్మారక కార్యక్రమాలను యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మూడు ప్రదేశాలను ఒబామా సందర్శిస్తారు. కాగా గడిచిన దశాబ్దకాలం అమెరికాకు ఎంతో కష్టకాలమని, ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేశామని, అంతర్జాతీయంగా భాగస్వాములను పెంచుకున్నామని, అల్‌కాయిదాకు ఓటమి బాట చూపించామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జాతినుద్దేశించి అన్నారు.

English summary
September 11 tension in America. Terrorists attacked on joint towers in 2001 september 2001.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X