విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్య పోటీ చేస్తే గెలిపిస్తా: చిన్నం రామకోటయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
విజయవాడ: సినీ నటుడు బాలకృష్ణ వచ్చే శానససభ ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి పోటీ చేయాలని కృష్ణా జిల్లా నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య కోరారు. తన నియోజకవర్గం నూజివీడు నుంచి బాలకృష్ణ పోటీ చేయాలని, ఇక్కడి నుంచి పోటీ చేస్తే బాలయ్యను లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిపిస్తానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బాలకృష్ణ రాజకీయాల్లో వస్తానని చెప్పడాన్ని తాను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ ఆదివారంనాడు అనంతపురంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. బాలకృష్ణ ప్రకటన తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యూహంలో భాగంగానే ఆయన ఆ ప్రకటన చేశారని అంటున్నారు.

English summary
Nuziveedu MLA Chinnam ramakotaiah appealed to Balakrishna to contest from seat next Assembly election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X