హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసుల వైఫల్యం: చిరు, అయాజ్‌పై కేసు నమోదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు, మాజీ భారత జట్టు సారథి మహమ్మద్ అజహరుద్దీన్ తనయుడు అయాజుద్దీన్ యాక్సిడెంటులో పోలీసుల వైఫల్యం కూడా ఉందని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి సోమవారం అన్నారు. అపోలో హాస్పిటల్ వెళ్లి అయాజుద్దీన్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అయాజుద్దీన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఔటర్‌లో నిఘా లోపం కారణంగా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కాగా అయాజుద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, క్రికెటర్లు మహమ్మద్ కైఫ్, వివిఎస్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

కాగా, ఆయాజుద్దీన్‌పై నార్సింగ్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. అతనిపై 304 (ఎ), 337 సెక్షన్ల కింద తమంత తాముగా కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని సోదరుడు అఫ్జల్ మరణించగా, అయాజ్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. వెంటలేటర్‌పై ఉన్నాడు.

English summary
Tirupati MLA Chiranjeevi said today that Ayazuddin accident is police neglect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X