హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నో వర్క్ నో పే: ఉద్యోగులకు సర్కారు వార్నింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mukesh Goud-Danam Nagender
హైదరాబాద్: సకల జనుల సమ్మెపై ప్రభుత్వం ప్రభుత్వ కొరడా ఝులిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సోమవారం మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ తదితరులు మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనం. ఉద్యోగులు వెంటనే సమ్మె నోటీసును ఉపసంహరించుకోవాలని మంత్రి దానం నాగేందర్ సూచించారు. ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగుల పట్ల సానుభూతితోనే ఉందన్నారు. తెలంగాణ సమస్యపై ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ఉద్యోగులు ప్రజలకు నష్టం చేసే రీతిలో సమ్మె చేయవద్దని కోరారు. ఒకవేళ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పూనుకుంటే 177 చట్టాన్ని నిలిపి వేసినా దానిపై పునరాలోచించవలసి ఉంటుందన్నారు.

177 చట్టం హైకోర్టు ఆదేశాల మేరకే అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులపై నో వర్క్ నో పే అమలు చేసే అవకాశం ఉందన్నారు. రాజీవ్ యువకిరణాల ద్వారా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. తెలంగాణపై అందరికీ ఆమోదయోగ నిర్ణయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల తెలంగాణ ప్రజలే నష్ట పోతారని మరో మంత్రి ముఖేష్ గౌడ్ అన్నారు. తెలంగాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదన్నారు. సమ్మెపై ఉద్యోగులు మరోసారి ఆలోచించాలన్నారు. సమ్మె ఎవరి మీద చేస్తున్నారో గుర్తెరగాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమ్మెపై సమీక్ష అనంతరం వారు మాట్లాడారు.

English summary
Minister Danam Nagender and Mukesh Goud warned Telangana employees to withdraw strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X