• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మేం గాజులు తొడుక్కోలేదు: టి - నేతలపై రాయపాటి

By Srinivas
|

Rayapati Sambasiva Rao
న్యూఢిల్లీ: కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఉన్నారో? తీవ్రవాదులు ఉన్నారో? ఎవరికి తెలుసునని గుంటూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సోమవారం గుంటూరులో అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. హైదరాబాదులోకి అడుగు పెట్టనీయకుంటే ఊరుకోమన్నారు. ఏం చేయాలో మాకు తెలుసుని మేం గాజులు తొడుక్కొని కూచోలేదన్నారు. హైదరాబాద్‌పై అందరికీ హక్కు ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు వంటి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.

రాష్ట్రాన్ని విభజిస్తే దేశంలో తీవ్ర ఇబ్బందులు వస్తాయన్నారు. హైదరాబాదులో 40 శాతం సీమాంధ్ర ప్రజలు ఉన్నారన్నారు. వీరంతా సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని, తామంతా కలిసే సమైక్య వాదం వినిపిస్తున్నామన్నారు. పది పదిహేను రోజుల్లో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తానని చెప్పారు. పదవి విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన నాయకులను పార్టీ వదులుకోదనే నమ్మకం తనకుందన్నారు.

English summary
Guntur Parliament Member Rayapati Samba Siva Rao suspected that terrorists in Kakatiya and Osmania University
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X