వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాప్ టెన్‌లో లేని వాసుకి, మిస్ యూనివర్స్‌లో నిరాశ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vasuki Sunkavalli
ముంబై: బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరం వేదికగా జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలలో భారత్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వాసుకి సుంకవల్లికి టాప్ టెన్‌లో చోటు దక్కలేదు. దీంతో ఆమె మిస్ యూనివర్స్ పోటీలలో నిరాశ ఎదురయింది. మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొన్న వారు ఎస్మెమ్మెస్, ఈ-మెయిల్ ద్వారా టాప్ టెన్‌లో చోటు దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే మన దేశం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న వాసుకి సుంకవల్లికి అనుకున్న స్థాయిలో ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లు రాకపోవడంతో నిరాశతో వెనుదిరాల్సి వస్తోంది.

రియో జి జనీరోలో మంగళవారం మిస్ యూనివర్స్ పోటీ జరుగుతుంది. వాసుకికి మద్దతుగా మనవారు అంతగా స్పందించినట్లు కనిపించడం లేదు. మీడియా ప్రచారం చేసినప్పటికీ ప్రజల నుండి స్పందన రాక పోవడం బాధాకరం. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన రెండో దేశం, టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్న యువత ఉన్నప్పటికి వాసుకికి ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదు. కాగా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్‌గా ఎంపికైన లారాదత్తకు న్యాయ నిర్ణేతలు 9.99 మార్కులు ఇచ్చారు. ఇప్పటి వరకు మిస్ యూనివర్స్ చరిత్రలో ఇదే అత్యధికం.

English summary
Vasuki Sunkavalli is not in top ten to contest in miss universe by not getting much more sms and e-mails.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X