వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్య దిన పత్రిక అధినేత నూకారపు అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nukarapu Surya Prakash Rao
హైదరాబాద్: ప్రముఖ తెలుగు దిన పత్రిక సూర్య అధినేత నూకారపు సూర్య ప్రకాశ్ రావును సిబిఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. నాదర్ గూల్ భూముల వ్యవహారం కేసులో హాజరవడానికి తమ ముందుకు వచ్చిన నూకారపు సూర్యప్రకాశ్ రావును సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. 1994వ సంవత్సరంలో అనంతపురం జిల్లాలోని విజయ బ్యాంకును మోసం చేశారనే అభియోగంలో నూకారపు సూర్య ప్రకాశ్ రావును అరెస్టు చేశారు. ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఐదుగురు నిందితులలో ఒకరైన నూకారపు ఈ నెల 9వ తేదిన తన ఆరోగ్యం బాగా లేదని అందుకు తనను అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. రెండు వారాల పాటు అరెస్టును నిలిపివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది.

అయితే రెండు, మూడు రోజులుగా నూకారపు వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన కేసు వ్యవహారంలో సిబిఐ ముందు హాజరవుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం బాగానే ఉందని సిబిఐ అధికారులు ఆయనను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా సరూర్ నగర్‌లోని నాదర్ గూల్ ప్రాంతంలో జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన పొట్లూరి వర ప్రసాద్ నుండి సుమారు 600 ఎకరాల భూమి కొన్న కేసులో ఆయన సిబిఐ ముందు రెండు రోజులుగా హాజరవుతున్నారు. కాగా అనంతపురం జిల్లాలోని విజయ బ్యాంకును మోసం చేశారనే అభియోగంలో నూకారపు సూర్య ప్రకాశ్ రావు ఐదో ముద్దాయిగా ఉన్నాడు. నూకారపు సూర్యప్రకాశ్ రావును నాంపల్లి కోర్టు 25 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసింది. రేపు గురువారం ఉదయం పదిన్నర గంటలకు తమ ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆయనను ఆదేశించారు.

English summary
CBI officers arrested Surya daily MD Nukarapu Surya Prakash Rao today in Vijaya Bank froud case at Ananthapur district in 1994.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X